ప్రవాసాంధ్రుల హృదయాల్లో అమెరికన్ తెలుగు అసొసియేషన్ (ఆటా)కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం మీకందరికి తెలిసిందే. మూడు దశాబ్దాలలో మరిచిపోలేని ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆటా.. జులై 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన కన్వెన్షన్‌తో కొత్త చరిత్ర సృష్టించిందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో అమెరికా వేదికగా ఒక భారీ తెలుగు ప్రభంజనాన్ని సృష్టించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం.
కరోనా సృష్టించిన కల్లోలం ఒకవైపు, అమెరికా వ్యాప్తంగా ద్రవ్యోల్భణ సూచనలు మరో వైపు.. అయినా ఆటా మీద అభిమానంతో వేలాది మంది ప్రవాసాంధ్రులు కన్వెన్షన్ కోసం తరలివచ్చారు. తెలుగు కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా అత్యంత ఆడంబరంగా జరిగిన వేడుకల్లో పాల్గొని కన్వెన్షన్‌ను కన్నుల విందుగా మార్చారు.
ప్రతికూల పరిస్థితుల్లో ఇంతటి భారీ స్థాయిలో కన్వెన్షన్ నిర్వహించడం సాధారణ విషయం కాదు. 15వేల మంది తెలుగు ప్రజలను ఒక్కతాటి పైకి చేర్చి పండుగ చేయడం మామూలు మాట కాదు. మీ అందరి సహకారం, మద్ధతు వల్లే ఈ ఘన విజయం సాధ్యమయింది. ఈ గొప్ప కార్యక్రమంలో భాగమైన దాతలు, కార్పోరేట్ స్పాన్సర్లు, సభ్యులు.. ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.
అందరి నుంచి ఒకే మాట వస్తోంది. అమెరికా గడ్డపై ఇంతటి మహా కన్వెన్షన్‌ను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. పోటెత్తిన తెలుగు అభిమానానికి ఇది నిదర్శనం. ఆటా కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు, ఆఫీసు బేరర్లు, అడ్వైజరీ కమిటీలు.. అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. కొండంత అండగా మీరు అందించిన మద్ధతు, ఆటా పట్ల మీ ప్రేమాభిమానాలకు ఎప్పుటికీ రుణపడి ఉంటాం.
ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఉత్తర అమెరికా తెలుగు ప్రజల అభ్యున్నతికి ఆటా మరింత బాధ్యతగా కృషి చేస్తుందని ప్రమాణం చేస్తున్నాం.
ధన్యవాదాలు
అమెరికన్ తెలుగు అసొసియేషన్ (ATA)
Links:
https://drive.google.com/drive/folders/1MxwDYkwHaf-ShrMS4kHGcy8llN4ENt8j
Souvenir
Comments 1