బూతులు మాట్లాడతాం ఏం పీక్కుంటారో పీక్కోండి అని తెగించిన వైసీపీ నేతలకు మెల్లగా తత్వం బోధపడుతోంది. బూతులు ఎవరైనా తిట్టగలరని, తెగేదాకా లాగితే వార్నింగులు తప్పవు అని అర్థమయ్యేలా మారాయి పరిస్థితులు.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఓటేయని ప్రజలను వైసీపీ నేతలు తిట్టడం, దాడులకు పాల్పడటం జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ సొంత ఊరిలో జనసేన గెలిచింది. ఈ సందర్భంగా వారు ఊరేగింపు చేశారు. వైసీపీ నేతలకు, జనసేన నేతలకు అక్కడ గొడవ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు పవన్ పై విమర్శలు చేశారు. దీంతో పవన్ ఘాటుగా స్పందించారు.
‘‘భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ. కోపరేటివ్ బ్యాంకులో సొమ్ము దాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి . అలాంటి వ్యక్తి… ఇలా కాక మంచిగా ప్రవర్తిస్తాడని ఆశించలేం’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
గ్రంధి శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని, వైసీపీ ఎమ్మెల్యే చర్యలపై అనవసరంగా స్పందించవద్దని పవన్ తనదైన శైలిలో చెప్పారు. “పిచ్చికుక్క కరిస్తే తిరిగి కరవకూడదని.. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు ఆగాలాన్నారు. త్వరలో మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది.. పిచ్చికుక్కని పట్టుకెళ్తుందని” ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్.
పవన్ స్పందన వైరల్ అయ్యింది. భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నందున డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. మొత్తానికి వైసీపీకి ప్రతిపక్షాల వేడి తగలడం మొదలైంది.