పంచాయతీ ఎన్నికల్లో గెలిచాం గెలిచాం అని డబ్బా కొడుతున్న వైసీపీ నేతలకు మున్సిపల్ ఎన్నికలు అనగానే గుండెల్లో దడ మొదలైంది. ఇవి గుర్తుమీద జరిగే ఎన్నికలు.
పాలనలో అరాచకాన్ని మధ్యతరగతి మనసుని ప్రతిబింబించే ఎన్నికలు ఇవి. ఇక్కడ బెదిరింపులు కుదరవు. నిమిషాల్లో అరాచకాలు వైరల్ అవుతాయి. అంతేకాదు దొంగలు లెక్కలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలివి.
ఈ క్రమంలో పురపోరు వాడిగా వేడిగా సాగుతోంది. భారీ వేధింపులు, అధికార బలం, డబ్బు అన్ని వాడినా కూడా పింఛన్లు తీసేస్తారని తెలిసినా కూడా 30 శాతానికి పైగా సీట్లు పంచాయతీల్లో గెలిచింది. మిగతా ఆ 70 శాతం సీట్లు ఎట్లా వచ్చాయో మాస్ లీడర్ జలీల్ ఖాన్ చెబుతు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంచాయతీ ఎన్నికలు చూసి మురిసిపోవద్దు.
ప్రజల మీద మీరెంత దౌర్జన్యం చేశారో
పోలీసులను ఎలా వాడారో
ఎంత డబ్బు ఖర్చుపెట్టారో
ఉద్యోగులను ఏ రకంగా హింసించారో ఎవరికి తెలియవు.
చూపిస్తాం
పట్టణాల్లో వైసీపీ సత్తా ఏంటో తేలుతోంది
లోపలేసినా చాపేసుకుని పడుకుంటా కానీ భయపడి ఇంట్లో ఉండేది లేదు
బయటకు వస్తే ఊడేది లేదు అంటూ జలీల్ ఖాన్ తనదైన శైలిలో మాట్లాడారు.
ఆయన మాటల్లోనే వినండి.