ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబంలో చవి చూడని ఓ ప్రత్యేక రాజకీయ పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది. రాజకీయాల్లోకి తాను మాత్రం ఎందుకు రాకూడదని అనుకున్నారో.. ఇప్పుడు వైఎస్ కుమార్తె షర్మిల కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే.. ఈ పరిణామం.. రాజకీయంగా సెగలు రేపడం అనేక విషయాన్ని పక్కన పెడితే.. వైఎస్ కుటుంబంలోనే పొలిటికల్ చిచ్చు పెడుతోందని అనుకోవచ్చు.
ఏపీలో జగన్ స్తాపించిన వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన మాతృమూర్తి విజయ మ్మ, సోదరి షర్మిల.. సహా అందరూ ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయమ్మ పార్టీకి గౌరవ అధ్యక్షురా లుగా ఉన్నారు. రెండు ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేశారు. కుమారుడిని గెలిపించుకునేందుకు చమటో డ్చారు. అంటే.. దీనిని బట్టి కుమారుడికి విజయమ్మ పొలిటికల్ మద్దతు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు విజయమ్మకు రెండో కన్నయిన.. కుమార్తె.. షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు.
తాను పార్టీ పెట్టడాన్ని తన అన్న సీఎం జగన్‌కు ఇష్టం లేదని షర్మిల ప్రకటించారు. అయితే, తన తల్లి మద్దతు మాత్రం తనకు ఉంటుందని ఖచ్చితంగా ఆమె ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మరి ఇదే నిజమైతే.. షర్మిలను రాజకీయాల్లోకి నేరుగా రావొద్దని జగన్‌కు ఆగ్రహం కలిగించదా? అనేది కీలక ప్రశ్న. మరోవైపు.. ఏపీలో కుమారుడికి సపోర్టు చేసి.. తెలంగాణలో కుమార్తెకు మద్దతివ్వకపోయినా.. ఇబ్బందే. వెరసి ఇప్పుడు విజయమ్మ చిక్కుల్లో పడ్డారు.
ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. విజయమ్మ.. సపోర్టు జగన్‌కే ఉంటుందని భావించవచ్చు. అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొని రాజకీయంగా తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన జగన్ వైపే ఆమె నిలబడవచ్చని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో కుమార్తె ను నేరుగా సపోర్టు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఆమె ఎలాంటి పంథా అనుసరిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే, షర్మిల మాత్రం తాను పార్టీ పెట్టడం తన తల్లికి ఇష్టమే అంటోంది. అంటే పూర్వపు గౌరవం జగన్ పై విజయమ్మకు లేదా?