సాధారణంగా లోకేశ్ పెద్దగా కోపంతో ఊగిపోయిన ఘటనలు తక్కువే. ఉన్నంత మేరకు చెప్పాలనుకున్నదేదో చెప్పి వెళ్తారు. ఇవాళ జూమ్ కాన్ఫరెన్స్ కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ఉన్నట్టుండి వైస్సార్ చీఫ్ జగన్ విధేయులుగా ఉన్న ఆ ఇద్దరూ ఎంట్రీ ఇవ్వడంతో లోకేశ్ రేంజ్ ఒక్కసారిగా పెంచేశారని, ఆ విధంగా తమకు తెలియకుండానే తమ పూర్వాశ్రమ పార్టీకి ఎంతో సాయం చేశారని సోషల్ మీడియాలో ఓ వ్యాఖ్య వినిపిస్తోంది.
థాంక్యూ నాని థాంక్యూ వంశీ అని ఇప్పుడు ఆ ఇద్దరికీ లోకేశ్ చెప్పాలి అని ఓ సీనియర్ జర్నలిస్టు అంటున్నారు. ఆహా ! నిజమే కదా ! ఆయనేదో ఆయన పని కానిస్తుంటే మధ్యలో వీళ్లు ఎంటర్ కావడమే పెద్దగా ఈ వార్త సంచలనం అయి ఉంది అని ఆయన అభిప్రాయంగా ఉంది.
ఇదే విషయంలో మరో మాట కూడా వస్తున్నది జగన్ కు అత్యంత విధేయులుగా ఉన్న ఆ ఇద్దరూ.. ఓ విధంగా పెద్దగా ఇతరులపై విమర్శలు చేయని లోకేశ్ ను మరో సారి రెచ్చగొట్టి, పొలిటికల్ కెరియర్ లో మైలేజ్ పెంచారని కూడా ఓ వాదన సోషల్ మీడియా టాక్స్ లో వినిపిస్తోంది.
అసలు ఫేక్ ఐడీలతో ఎందుకు ఎంట్రీ ఇవ్వడం నేరు ఐడీలతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుని, ఆ విధంగా ఇచ్చామని వంశీ అంటున్నా రు. అదేవిధంగా కొడాలి నాని కూడా తమతో నేరుగా మాట్లాడే దమ్ము లేక ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ను కట్ చేశారని కూడా అంటున్నారు. ఈ మాటల లోతు, గాఢత ఎలా ఉన్నా మంత్రి పదవి పోయాక సైలెంట్ గా ఉన్న కొడాలి నాని చాలా రోజుల తరువాత మళ్లీ లోకేశ్ ను టార్గెట్ చేసుకుని వీరవిధేయుడిగా మరోసారి పేరు తెచ్చుకున్నారు.
ఇది కట్ చేయటమా NTV?
సాక్షి అంటే యజమానికి సేవ చేయాలి. నీకేమయింది?
బులుగు మీడియాకు ముఖ్య కార్యదర్శిగా మారిపోయావా?#KamsaMamaJagan https://t.co/cqdwE45j3R pic.twitter.com/Mgvnck2oY7
— Telugu Desam Party (@JaiTDP) June 9, 2022
అయినా తాము చినబాబుతో నేరుగా బహిరంగ చర్చకు సిద్ధమేనని అన్నారు వంశీ. ఫేక్ ఐడీలేంటి అది నా మేనల్లుడి ఐడీ.. అంటే ఆ కుర్రాడి మేనమామతో లోకేశ్ మాట్లాడరా .? అని నాని తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. దొంగ ఐడీలేంటి అదేమయినా దొంగ మీటింగా కాదు కదా ! జూమ్ లో టెన్త్ పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వాలని అనుకున్నారు..మేం కూడా ఆయనతో ఇంట్రాక్ట్ అయి నాలుగు సూచనలూ, సలహాలూ ఇవ్వాలనుకున్నాం ఇందులో తప్పేంటి అని అన్నారు వంశీ.
నీ వైసీపీ కుక్కల్ని పంపడం కాదు జగన్ రెడ్డి.. స్వయంగా నువ్వే రా… పదో తరగతి పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి ఛానల్ లోనే చర్చించుకుందాం.#KamsaMamaJagan pic.twitter.com/GE4pFzG0ii
— Lokesh Nara (@naralokesh) June 9, 2022
ఈ విధంగా ఆ ఇద్దరూ మళ్లీ మీడియా ఎదుట మాట్లాడి లోకేశ్ మీటింగ్ కు మరో సారి టీఆర్పీ రేటింగ్స్ పెంచేశారు. దీంతో ఓ విధంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. టెన్త్ విద్యార్థులను ఉద్దేశించి లోకేశ్ కండక్ట్ చేసిన జూమ్ మీటింగ్ సందర్భంగా చిన్నపాటి సంఘర్షణాత్మక వాతావరణం ఉన్నా కూడా ఇదీ ఒకందుకు తమకు మంచిదేనని, ఎవ్వరూ పట్టించుకోని నేతలు ఈ విధంగా తమ మీటింగ్ లకు వచ్చి క్రేజ్ పెంచుకోవాలనుకోవడం కూడా ఓ విధంగా వారేంటో వారెంతో మీడియా ముఖంగా తెలిసిందని టీడీపీ కౌంటర్లు ఇస్తోంది.