ఆంధ్రావని వాకిట అధికార పార్టీలో అన్ కంట్రోల్డ్ వెర్షన్ లో ఉన్న లీడర్లకు లోటే లేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు. పదవి రాగానే బుద్ధి మంతులు అయిపోయినవారూ ఉన్నారు. ఈ కోవలో కృష్ణా జిల్లా, మచిలీపట్నంకు చెందిన విక్టర్ ప్రసాద్ ఉన్నారు.
ఇదే కోవలో మేరుగ నాగార్జున అనే మంత్రి కూడా ఉన్నారు. మేరుగ నాగార్జున కొంత బెటర్ కానీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్న లాయర్ విక్టర్ ప్రసాద్ ఎవ్వరి మాటా వినడం లేదు. అయితే ఈ ఇద్దరినీ ఓ విషయమై మెచ్చుకోవాలి. అధికారులను ముందూ వెనుకా చూడకుండా సీనియర్ మంత్రుల కన్నా వేగంగా రియాక్ట్ అయి తమ మాటే నెగ్గాలన్న పంతంలో ఉంటారు. సొంత పార్టీ మనుషులే అయినా అస్సలు తగ్గరు.
ఎమ్మెల్సీ అనంతబాబు విషయమై కూడా ఎక్కువగా స్పందించింది మేరుగ నాగార్జునే ! డ్రైవర్ సుబ్రహ్మణ్యంది మర్డర్ అని చెప్పింది కూడా ఆ వేళ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న నాగార్జునే ! పక్కనే బొత్స లాంటి లీడర్లు ఉన్నా పట్టించుకోరు.
ఇదే కోవలో మరో లీడర్ సీదిరి అప్పల్రాజు. ఈయన కూడా ఆవేశంతో ఊగిపోతుంటారు. నిన్నటి వేళ కార్యకర్తల సమావేశంలో ఎప్పటిలానే ఆగ్రహంతో ఊగిపోయారు శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో ! నిజాలు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు. మైకు దొరకగానే కొందరు మీడియా దృష్టిలో పడాలనే మాట్లాడుతున్నారని ఎత్తిపొడుపు మాటలు మాత్రం మాట్లాడతారు ఆయన అని సొంత పార్టీ నేతలే అసంతృప్తి చెందుతున్నారు. బాధలు పర్సనల్ గా ఎలా చెబుతాం?
ఏదేయినా పబ్లిక్ గానే చెబుతాం అని నిన్నటి వేళ కొందరు జెడ్పీటీసీ ఫైర్ అయ్యారు కూడా ! ఇలాఉంటే ఇప్పుడంటే పదవి లేని కారణంగా తగ్గిపోయిన పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్లంతా అన్ కంట్రోల్డ్ వెర్షన్లో ఉన్న లీడర్లే ! కనుక విక్టర్ ప్రసాద్ ఒక్కరే తెరపై కనిపించవచ్చుగాక.. కలెక్టర్లనూ, పోలీసోళ్లనూ తిట్టిపోయవచ్చు గాక ఆ మాత్రం తిడితే కానీ అక్కడ పనులు కావడం లేదు అన్న విషయం మాత్రం ఏపీ సీఎంఓ గుర్తించడం లేదు. అదే దురదృష్టకరం.
ఏమాటకు ఆ మాట ఆయన అతి చేస్తున్న విషయం వాస్తవమే అయినా కొన్నింట ఆ అతి కూడా మంచే చేస్తుంది అన్నది కూడా అంగీకరించాలి. అలానే నాయకులు కొంత అన్ కంట్రోల్డ్ గా ఉన్నా కూడా ఇతరుల మాట సీదిరి లాంటి వారు, బొత్స లాంటి వారు వినిపించుకుంటే మేలు.