జూబ్లీహిల్స్ అమ్నేషియా గ్యాంగ్ రేప్ నకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల వీర్య అవశేషాలు ఇన్నోవా కారులో లభ్యం కావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ అవశేషాలను సేకరించిన దర్యాప్తు బృందాలు వీటిని ల్యాబ్ కు పంపారు. దీంతో ప్రముఖుల పిల్లలు ఇందులో ఉన్నారా లేరా అన్న మాట ఒకటి తేలిపోనుంది.
వెస్ట్ జోన్ డీసీపీ మాత్రం అస్సలు ఏ ఆరోపణ వస్తున్నా దానిని తోసిపుచ్చుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కొడుకు పేరు కూడా నిందితుల జాబితాలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఆయన పేరు ను ఎ 6 గా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ డీసీపీ మాత్రం ఇది కూడాతప్పుడు ప్రచారమే అని తేల్చేశారు. ఇప్పుడు పోలీసుల తీరుపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. మరోవైపు నిన్నటి వేళ పాతబస్తీ ఓ చిన్నారి లైంగిక దాడికి గురయింది. ఆ వార్త గురించి అస్సలు ప్రస్తావనే లేదు.
ఇక ప్రస్తుత గ్యాంగ్ రేప్ ఘటనకే వస్తే.. నిందితుల్లో చాలా మంది ప్రముఖుల బిడ్డలే ఉండడంతో కేసును పక్కదోవ పట్టించాలన్న తాపత్రయం మాత్రం బాగానే ఉందని తెలుస్తోంది. ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ పైకి చెప్పే ఏ మాట కూడా నమ్మేందుకు వీల్లేకుండా ఉందని మరోసారి రఘునందన్ లాంటి బీజేపీ లీడర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇక నిందితులు తాము అత్యాచారం జరిపేందుకు వాడిన ఇన్నోవా కారును మొయినాబాద్ కు తరలించారు. అక్కడే ఉన్న ఓ ప్రజా ప్రతినిధి ఫాం హౌస్ లో ఉంచి అక్కడ కారు స్టిక్కర్లను పీకేశారు. మొదట పబ్ నుంచి మెర్సిడేజ్ బెంజ్ కారులోనే బయలు దేరిన నిందితులు సమీప బేకరీ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇన్నోవా కారులో బయలుదేరారు.
ఓ నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై ఆరుగురు అత్యాచారం చేశారన్న వాదనలు ఉన్నాయి. అత్యాచారం అనంతరం తిరిగి బాలికను సాయంత్రం ఏడు గంటల సమయంలో పబ్ దగ్గరే దిగబెట్టి వెళ్లారు. ఇక ఈ కేసులో ఏ6 ఎవరన్నది ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా తేలనుంది. అందాక టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఘటనపై చెప్పే మాటలు, మీడియాలో వినిపించే మాటలు ఏవీ నమ్మవద్దని బీజేపీ అంటోంది.