జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు..తాజాగా మరో నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఆరో నిందితుడు ఓ పార్టీకి ఎమ్మెల్యే కొడుకుని తెలుస్తోంది. అయితే, ఆ పార్టీకి చెందిన బడా నేత సూచనతో కేసు పూర్తిగా బయటికి రాకముందే ఎమ్మెల్యే తనయుడిని దుబాయ్ పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల్లో ముగ్గురు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు కావడం విశేషం. నిందితుల్లో ఒకరు వక్ఫ్ బోర్డు చైర్మన్ తనయుడు కాగా, మరొకరి తండ్రి జీహెచ్ఎంసీ కార్పొరేటర్. మరొక నిందితుడి తండ్రి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో కీలక నేత. మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఒకరు ఎంఐఎం ఎమ్మెల్యే సోదరుడికి కొడుకు. మరో నిందితుడు సాదుద్దీన్ తండ్రిరి ఒక పార్టీ సీనియర్ నేత ప్రధాన అనుచరుడు. ఇక, ఆరో నిందితుడిని ఓ ఎమ్మెల్యే కొడుకుగా భావిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి పాత్ర కీలకం అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో లీకైన వీడియోలో బాధితురాలితో అసభ్యంగా ప్రవరించింది ఎమ్మెల్యే కొడుకు అనే అనుమానిస్తున్నారు. ముందుగా బాధితురాలిని బెంజి కారులో తీసుకువెళ్లిన నిందితులు…ఆ తర్వాత ఇన్నోవా వాహనంలోని తరలించారు. ఇన్నోవా కారులోనే ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని తెలుస్తోంది. కానీ, బాధితురాలు కారులో ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే కొడుకు ఇన్నోవా కారు దిగి బేకరీ వైపు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు
ఆ వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యే కొడుకును ఏ6గా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారట. పోలీసులు చెబుతున్న దానికి.. బయటికి వస్తున్న విషయాలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. గ్యాంగ్ రేపు కేసును నీరుగార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కొడుకును కేసు నుంచి బయటపడేసేందుకు కొందరు బడా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభించేటప్పటికే.. నిందితులు గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా కారులో ఆనవాళ్లు, ఆధారాలు దొరకకుండా చేశారని అంటున్నారు.