మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ను వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై కొత్తపల్లిని పార్టీ నాయకత్వం పార్టీ నుంచి బయటకు పంపేసింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా భీమవరం జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. జిల్లా కేంద్రాన్ని భీమవరం నుండి నరసాపురంకు మార్చాలంటు కొత్తపల్లి తన మద్దతుదారులతో నానా రచ్చ చేశారు. ప్రభుత్వం పట్టించుకోక పోయేసరికి సమావేశం పెట్టి ప్రసాదరాజును ఎంఎల్ఏగా గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకటించటమే కాకుండా వేదిక మీదనే తన చెప్పుతీసుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో బాగా వైరలైంది.
వైసిపి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుని గెలిపించి తప్పు చేసానని చెప్పుతో చెంపమీద కొట్టుకున్న మాజీమంత్రి ,వైసిపి నాయకుడు కొత్తపల్లి సుబ్బరాయుడు…1/3 pic.twitter.com/yHxKZaMDDl
— Ravi Kondapalli (@Ravi_4545) March 3, 2022
అప్పటినుండి ఎంఎల్ఏకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడం ఖాయమని అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలు మారిన కొత్తపల్లి ఇపుడు వైసీపీలో ఉన్నారు. అయితే… ఇతన్ని నిర్లక్ష్యం చేసినా తాను ఇక్కడ ఓడిపోతాను. అతన్ని సస్పెండ్ చేసినా ఓడిపోతాను అని జగన్ ఫిక్సయినట్టున్నాడు. కనీసం సస్పెండ్ చేస్తే మిగతా నియోజకవర్గాల వారికి భయం అన్నా ఉంటుంది అన్న ఐడియాతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశాడు.
కొత్తపల్లిని సస్పెండ్ చేయడానికి ధైర్యం చేసిన జగన్ రఘురామపై వేటు వేయడానికి మాత్రం జంకుతున్నాడు. మొత్తానికి జగన్ పైకి కనిపించినంత ధైర్యం ఉన్న వ్యక్తి కాదని స్పష్టంగా అర్తమవుతోంది.