షార్లెట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్నగారి శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 28, అన్నగారి జయంతిని పురస్కరిం చుకుని నిర్వహించిన కార్యక్రమంలో శత జయంతి వేడుకలను ప్రారంభించారు. మే 28వ తేదీకి అన్నగా రు జన్మించి 99 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది మొత్తం శత జయంతిని ఘనంగా నిర్వ హించాలని టీడీపీ నిర్ణయించింది.
ఈ క్రమంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో అన్నగారి శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. మే 28, సాయంత్రం 6 గంటలకు షార్లెట్లోని ప్రొవిడెన్స్ పాయింట్ క్లబ్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎంవీఎస్ ఎన్ రాజు, టీడీపీ ఎన్నారై విభాగం సమన్వయకర్త ‘జయరాం కోమటి’ పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలికారు.
కార్యక్రమాన్ని నిర్వహించిన వారిలో చందు గొర్రపాటి, బాలాజీ తాతినేని, శ్రీనివాస్ పాలడుగు, లోహిత్ నన్నపనేని, నాగ పంచుమర్తి, రంగనాథ్ వీరమాచనేని తదితరులు ఉన్నారు. సమన్వయ కర్తలుగా కిరణ్ గోగినేని(అట్లాంటా), శ్రీనివాస్ (అర్మంద) వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అన్నగారి దివ్య స్మృతులను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. శత జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని.. నిర్ణయించారు. అదేవిధంగా ‘ఎన్టీఆర్’ స్ఫూర్తిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని తీర్మానం చేశారు.