https://twitter.com/ReddiMalati/status/1529698299556466688
డ్రోజుల పాటు పసుపు పండగ జరగనుంది. ప్రకాశం జిల్లా వాకిట ఉత్కృష్ట రీతిలో జరగనుంది. ఈ నేపథ్యంలో మహానాడుకు అంతా సిద్ధం అయింది. అధినేత చంద్రబాబు ఆధ్వర్యాన ఇవాళ మంగళగిరి నుంచి ఒంగోలు లోని మండువవారిపాలెం (మహానాడు ప్రాంగణం) వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక ఈ మహానాడు జిల్లాల నుంచి భారీ స్థాయిలో శ్రేణులు తరలివెళ్తున్నారు.
రెండు లక్షల మందికి పైగా ఇక్కడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అచ్చెన్నాయుడు మొదలుకుని పలువురు నాయకులు ఇప్పటికే క్షేత్ర స్థాయి ఏర్పాట్లకు సంబంధించి సమీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవం కావడంతో ఈ మహానాడు తమకు ఎంతో ప్రత్యేకం అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నతో సహా ఇతర ముఖ్య నాయకులు చెబుతున్నారు.
ఇక మహానాడు ప్రాంగణం నుంచి దేవినేని ఉమ (విజయవాడ నాయకులు, మాజీ మంత్రి) మాట్లాడారు. తమ కార్యకర్తలు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేందుకు బస్సులు అడిగితే ప్రభుత్వం అడ్డుకుందని, కనీసం ప్రయివేటు బస్సులు కూడా రానివ్వడం లేదని
ఆవేదన చెందారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా అడ్డు గోడలు ఉన్నా దాటుకుని మహానాడు ప్రాంగణానికి చేరుకుని తెలుగు జాతి పండుగను విజయవవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఒంగోలు మున్సిపల్ అధికారులు టీడీపీ జెండాలు పీకేశారు.. అని, ఇవన్నీ నిబంధనల పేరిట చేస్తున్నారమని చెబుతున్నారు అంటూ పలువురు నాయకులు ఆవేదన చెందుతున్నారు.
మహానాడు పండుగ వేళ తెలుగుదేశం అధినేత చేసే దిశా నిర్దేశమే తమకు ఎంతగానో కీలకం అని దేవినేని అంటున్నారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న చెడ్డ పాలనకు చరమగీతం పాడడం ఖాయమని ఆయన చెబుతున్నారు. త్వరలోనే తాము అధికారం అందుకోవడం ఖాయం అని, మహానాడును విజయవంతం చేయడమే అందుకు తొలి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు.
తగిన విధంగా నిబంధనల అనుసారం అద్దెలు చెల్లిస్తామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వకున్నా, ప్రయివేటు బస్సులలో ప్రయాణించినా ఒప్పుకోకుండా నియంత్రణ చేస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని దేవినేని హెచ్చరించారు.
నిన్న ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రులో జరిగిన మిని మహానాడు కార్యక్రమానికి ర్యాలీగా తరలివెళుతున్న శ్రీ నంద్యాల మదన్ మోహన్ లచ్చిరాజు గారి యూత్ గణపవరం టీడీపీ ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
ఉన్నమట్ల సునీత
ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి. @JaiTDP @ncbn pic.twitter.com/mhNLMkQIv3— Sunitha. Unnamatla (@SunithaUnnamat1) May 25, 2022