దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం మీటింగ్ జరుగుతుంది. కొన్ని ప్రశ్నలు జగన్ ను అడుగుతున్నారు అక్కడి ప్రతినిధులు. వాటికి ఆయన ఆన్సర్స్ ఇస్తూ ఇస్తూ మధ్య మధ్యలో నవ్వుతున్నారు కూడా ! ఓ విధంగా ఆయనకు ఇలాంటి సెషన్ కొత్త కనుక కొన్నింటికి సరైన జవాబులు చెప్పలేకపోతున్నారు అన్నది టీడీపీ మాట. సోషల్ మీడియాలో కూడా ఇదే మాటను వైరల్ చేస్తోంది టీడీపీ. అన్నయ్య అక్కడికి ఎందుకు వెళ్లావు.. అదానీని కలవాలంటే గుజరాత్ కు వెళ్తే సరిపోద్ది కదా అని సెటైర్లు కూడా వేస్తోంది టీడీపీ.
వీటి మాట ఎలా ఉన్నా బ్లూ గ్యాంగ్ అంటూ మరో టైప్ ర్యాగింగ్ కూడా ఇవాళే షురూ చేసింది టీడీపీ. ఇక టీడీపీ
నుంచి లోకేశ్ కూడా కొన్ని వాగ్బాణాలు సంధించారు. ఎవ్వరైనా సరే తన నాన్న బాటలోనే నడవాల్సిందే అని అన్నారు. ఇక ఏపీలో సేల్ ఫ్యాక్టర్ ఏముందో చూద్దాం.
పరిశ్రమలు రావాలి కానీ అవి కాలుష్యాన్ని అమితంగా నెత్తిన రుద్ద కూడదు అన్నది ఓ ప్రణాళిక పరమైన, విధానపరమైన నిర్ణయం కావాలి. కానీ ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే విషతుల్యం అయిన రసాయినాల విడుదలకే ఎక్కువ పరిశ్రమలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలా కాకుండా ఏపీలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ఉత్పత్తులకు మంచి చేయూత ఇస్తే అవన్నీ తప్పక సేల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఉపాధికి ఊతం ఇస్తే బాగుంటుంది. వాటి కోసం చిన్న చిన్న వ్యాపారులకు ఊతం ఇస్తూ పోయేందుకు జగన్ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉదాహరణకు విశాఖ జిల్లా, ఏటి కొప్పాక బొమ్మలు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా, పొందూరు ఖాదీ వస్త్రాలు, ఇంకా చెప్పాలంటే విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణలు, ఇవన్నీ కూడా సేల్ ఫ్యాక్టర్సే ! కానీ జగన్ స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ వసతులు ఇస్తారా ? పోనీ అలా వద్దనుకుని మిగతా విషయాలకు ఏమయినా ప్రాధాన్యమిస్తారా?
ఇవేవీ వద్దనుకుని సాఫ్ట్ వేర్ కంపెనీలను రప్పిస్తారా? ఇప్పటికే ఇక్కడ ఉన్న కంపెనీలు కొన్ని తలనొప్పులు భరించలేక దేశం దాటి పోయాయి. హానికర రసాయినాలు వెదజల్లే పరిశ్రమలే తప్ప! జనాలకు మేలు చేసే పరిశ్రమలేవీ ఇప్పుడిక్కడ లేవు. ఉత్పత్తి రంగంలో కీలకం అయినవి ఇక్కడే తయారై, మిగిలిన ప్రాసెస్ మాత్రం వేరే దేశంలో తయారు చేయించుకుని, మందులను మార్కెట్లోకి విడుదల చేసే కంపెనీలకు లోటే లేదు.
ఇక వైద్య రంగంలో ఏపీ సర్కారు సాధించిన విజయాలు ఏంటి అన్నవి కూడా ఆలోచిస్తే ఫార్మా కంపెనీలు మునుపటివే కానీ కొత్తగా పెద్దగా ఏర్పాటు కాలేదు. పోనీ వైద్యానికి సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రులు ఏమయినా బాగుపడ్డాయా అంటే అదీ లేదు. కరోనా వరకూ ప్రభుత్వ ఆస్పత్రుల తీరు కాస్త బాగానే ఉన్నా, తరువాత మాత్రం పెద్దగా అవి సజావుగా పనిచేసిన దాఖలాలే లేవు. కనుక ప్రజారోగ్యం బాగుంటే పరిశ్రమల మనుగడ బాగుంటుంది.
కాలుష్య నియంత్రణ చర్యలు బాగుంటే ప్రజారోగ్యం బాగుంటుంది. వీటి అన్నింటి కన్నా మించి బడ్జెట్లో కేటాయింపులు బాగుంటే పారిశ్రామిక రంగం అన్నది ఊతం దొరికి రాణిస్తుంది. ప్రజారోగ్యం దృష్టి లో ఉంచుకుని పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ప్రజారోగ్యం కాపాడితే మిగిలిన వనరుల వినియోగం బాగుండి మిగతా సేల్ ఫ్యాక్టర్స్ అన్నవి ఇంకాస్త వ్యాపార రంగాన కుదరుకుంటాయి. కనుక అన్నింటికీ ఆరోగ్యమే మూలం.
మరి! ఆరోగ్య రంగ ప్రాధాన్యం నిధులు గురించి అడిగితే జగన్ నవ్వుతారేంటి???