చిరు వేరు బన్నీ వేరు
చిరు చిచ్చర పిడుగు అయితే
బన్నీ ఆయనకు జిరాక్సు కాపీ
అని నిన్నమొన్నటి వరకూ
పొగిడిన నోళ్లే ఎందుకని అల్లు అర్జున్ పేరు చెబితే మండిపడుతున్నాయి. ఆయన్ను దూరంగానే ఉంచుతున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి కూడా పెద్దగా బన్నీకి గుర్తింపు అన్నది లేదు. చిరు పేరు ప్రసంగాల్లో ప్రస్తావించేందుకు కూడా కొన్ని సార్లు ఇష్టపడడం లేదు. చిరు పేరు కన్నా పవన్ పేరును ప్రస్తావించేందుకు ఎక్కువగా ఇష్టపడడం లేదు అని చెప్పడం సబబు.
ఆ విధంగా మెగా క్లాషెస్ మొదలయ్యాయి. కెరియర్ స్టార్టింగ్ లో మెగా స్టార్ పేరు చెప్పుకుని వచ్చిన బన్నీ ఇప్పుడు ఆ కాంపౌండ్ నుంచి ఆ కాంపైనింగ్ నుంచి బయటకు వచ్చి ఎదిగి చాలా అంటే చాలా పేరు తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ కూడా చిరుతో సినిమాలు చేయడం లేదు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ వచ్చాక వేరు కుంపట్లు మరింత తీవ్రం అయ్యాయి. వరుణ్ తో మొన్న గని అనే సినిమాను అల్లు బాబి (అల్లు వారింటి పెద్ద అబ్బాయి) చేసినా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ ఫాం లాంఛ్ ఆహా సమయంలోనూ మెగా పేరు లేకుండానే జాగ్రత్తపడ్డారు అల్లు అరవింద్. ఇవన్నీ ఇప్పుడు మరింత చర్చలకు తావిస్తూ గత గాయాలను రేపుతూ, రేపటి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
మెగా ఫ్యాన్స్ కు సంబంధించి ఇప్పుడొక చర్చ విపరీతంగా జరుగుతోంది. అదేంటంటే బన్నీ లేకుండా మెగా ఫ్యాన్స్ మీటింగులు చేయడం వంటివి ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా నిన్నమొన్నటి వేళ జరిగిన మీటింగులకు బన్నీ ఫ్యాన్స్ ను పిలవలేదని, అదేవిధంగా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ పై బన్నీ బొమ్మ లేనేలేదని., అంటే బన్నీకి చిరుకూ మధ్య గ్యాప్స్ వచ్చాయి అని అంటున్నారు కొందరు. ఇదే నిజం అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతిచ్చే విషయమై బన్నీ అభిమానులు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం గ్యారెంటీ ?