ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడుల జోరందుకుంది. మొత్తం 25 జిల్లాల్లోనూ..(ఒంగోలులో మహానాడు నిర్వంచనున్నారు) మినీ మహానాడులు జరుగుతున్నాయి. ఆయా మహానాడుల్లో పాల్గొంటున్న నాయకులు.. పార్టీని డెవలప్ చేస్తామని.. మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించేది లేదని శపథం చేస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకుడు, మాజీమంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్నాజిల్లా లో నిర్వంచిన మినీ మహానాడులో నాయకులు పాల్గొన్నారు. వైసీపీ సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. జగన్మోహన్, కొడాలి నాని పెద్ద దొంగలని ఆరోపించారు. ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా చేసిన నానికి ఆ శాఖ గురించి ఏమీ తెలియని ఎద్దేవా చేశారు. మల్లెపూలు అమ్ముకునే వాళ్లు రాష్ట్ర మంత్రులయ్యారని ఘాటుగా విమర్శించారు.
జగన్, కొడాలి నానిలకు ప్రజలు బుద్ధి చెబుతారని అయ్యన్న అన్నారు. మోసపూరితంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. మహానాడు ప్రతి టీడీపీ కార్యకర్తకు పెద్ద పండుగలాంటిదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 151మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.
గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామని దివ్యవాణి తెలిపారు. గతంలో గుడివాడ అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు వచ్చేదని.. నేడు క్యాసినోవాడగా కొడాలి నాని మార్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, జయమంగళ వెంకటరమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.