గత 18 నెలల్లో ఆంధ్రాలో 150కి పైగా దేవాలయాలపై దాడులు జరగ్గా ఒకే ఒక చర్చిపై మాత్రమే ఇంతవరకు దాడి జరిగింది. చర్చిపై దాడి చేసిన వారిని గంటలో పోలీసులు అరెస్టు చేశారు.
కానీ ఇంతవరకు గుళ్లపై దాడులు చేసిన వారిలో 90 శాతం గుళ్లకు సంబంధం ఏ అరెస్టులు జరగలేదు. అయితే, ఏపీలో అశాంతికి కారణమయ్యే సంఘటనలు జరుగుతున్నపుడు వాటిని పోలీసులు ఆపడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
ఇన్ని దాడులు జరిగాక మరింత అప్రమత్తమై నిఘాపెంచి శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసులదే. అది పట్టించుకోవడంలో విఫలం అయితే సమాజానికి అంతటికీ నష్టమే కదా.
తాజాగా దర్శి నియోజకవర్గ పరిధిలోని కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని కొండపై ప్రధానంగా శ్రీ నరసింహస్వామి గుడి ఉంది. అదే కొండపై కొండపై శ్రీ ఆంజనేయ స్వామి & శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామివార్ల దేవాలయాలు ఒకదానికొకటి 120మీ. దూరంలో ఉన్నాయి. హిందు పవిత్రస్థలంగా ఈ కొండ అలరారుతోంది.
ఇప్పుడా కొండపై మాకూ హక్కుందంటూ కొందరు కావాలనే ఆ 2 దేవాలయాల మధ్యనే ఓ చర్చి పెడుతున్నారు. దీనివల్ల అనవసరమైన అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. అదే పని ఇంకో చోట చేస్తే బాగుంటుంది కానీ హిందు ఆలయాల మధ్యనే చేయాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక ఎవరున్నదీ పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.