దిస్ ఈజ్ దేవీ నాగవల్లీ సైనింగ్ ఆఫ్
దిస్ ఈజ్ విష్వక్సేస్ సైనింగ్ ఆఫ్
ఈ విధంగా ఎవరి వారు ఈ కథ నుంచి
సైనింగ్ ఆఫ్ తీసుకుంటే మేలు
టీవీ 9 పబ్లిసిటీ జిమ్మిక్కుల దగ్గర
విష్వక్సేన్ కాదు కదా విజయ దేవరకొండ కూడా
తూగడు తూగలేడు కూడా !
తెలంగాణ హీరో పై మరో తెలంగాణ మంత్రి దానం నాగేందర్ మండి పడ్డారు. ఆయన సినిమాలు అడ్డుకుంటామని చెప్పారు. అయితే యాంకర్ దేవి నాగవల్లికి మాత్రం విష్వక్సేన్ సారీ చెప్పారు. మరి! ఇందులో టీవీ 9 కూడా కొంత తప్పు ఉంది. ఎదుటి వారు ఎంతగా సహనం కోల్పోయినా జర్నలిస్టులు సహనం కోల్పోకూడదు అన్నది ఓ ప్రాథమిక నియమం.
అయితే ఎప్పటికప్పుడు విలువల్లేని వార్తలే ఎక్కువగా ప్రసారం చేసే టీవీ 9 కూడా విలువలు కూడా మాట్లాడడం విడ్డూరం అని సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు విష్వక్ మద్దతు ఇస్తున్నారు. ఓ విధంగా ఆయన క్రేజ్ పెంచుతున్నారు.
తనపై ఎటువంటి కేసు నమోదు చేసినా తట్టుకోగలనని, కానీ చిన్న చిన్న వాళ్లు ఫ్రాంక్ వీడియోలు చేసుకుని నాలుగు డబ్బులు తెచ్చుకుని ఇంటి అద్దె కట్టుకుని బతికేవాళ్లు, వాళ్లను ఏమీ అనవద్దని విష్వక్ అంటున్నారు.వారిపై కేసులు వేయవద్దని వేడుకున్నారు.
ఇక ఈ తగాదాలో సినిమావాళ్ల కన్నా బయట వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాకు విపరీతంగా మద్దతు ఇస్తున్నారు. ఓ సినిమాను నిలబెట్టడం అన్నది తన బాధ్యత అని, అందుకోసం తాను రాత్రీ పగలూ కష్టపడతానని అంటున్నారు. అంతేకాదు అదొక ప్రాంక్ వీడియో దానిని అలానే చూడాలని వేడుకుంటున్నారు.
వివాదం ఎలా ఉన్నా టీవీ నైన్ గతంలో చేసిన తప్పిదాలు అన్నింటినీ వెలుగులోకి మరోసారి తెస్తున్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి టీవీ నైన్ మాట్లాడినప్పుడు ఏమయింది? విలువల మాట అని కొందరు విష్వక్ కు మద్దతుగా నిలిచి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఎదుటి వాళ్లకు నీతులు చెప్పడం.. ముందు మీరు పాటించలేనప్పుడు అని కూడా అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా టీవీ నైన్ ను తాము సమర్థించబోమని, యాంకర్ కు ఆయన హుందాగా క్షమాపణలు చెప్పడం బాగుందని కూడా
ఇంకొందరు తమ అభిమాన హీరోకు జేజేలు కొడుతున్నారు. చిన్న చిన్న హీరోల సినిమాలకు ఆదరణ దక్కడం ఓ మంచి పరిణామం అని, తెలంగాణ టాలెంట్ ను ఇంకాస్త ప్రోత్సహించాలని ఈ వివాదంకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కోరుతున్నారు.