దేశంలో కానీ.. పొరుగు రాష్ట్రంలో కానీ.. రాజకీయాలను పరిశీలిస్తే.. ఏ చిన్న తేడా వచ్చినా.. అప్పటి వరకు ఉంటున్న పార్టీలను వదిలిపెట్టి వచ్చేందుకు నాయకులు రెడీ అవుతున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను గమనిస్తే.. బీజేపీ బలపడింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ నాయకులు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్ని చోట్ల ఆప్‌లో చేరిపోయారు. అంటే… తమకు ప్రాధాన్యం లేదని.. భావించిన పార్టీలో ఉండేందుకు.. నాయకులు ఇష్టపడడం లేదు.
ఈ క్రమంలోనే బలంగా ఉంటుందని.. ఉందని భావిస్తున్న పార్టీల్లోకి సాహసోపేతంగా జంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే.. ఏపీలో అధికార వైసీపీ కేబినెట్‌ను మార్చుకుంది. దాదాపు 14 మంది పాత మంత్రులను పక్కన పెట్టింది. అదే సమయంలో 14 మంది కొత్తవారిని తీసుకుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. తమకు సీటు వస్తుందని.. తమకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని.. ఆశించిన వారు.. ఉన్నారు. అయితే.. వీరిని జగన్ పక్కన పెట్టారు. కనీసం.. వారి విన్నపాన్ని కూడా పరిగణించలేదు. అంతేకాదు. తాను అనుకున్నదే చేశారు. దీంతో తీవ్రస్థాయిలో వైసీపీలో అసంతృప్తులు రోడ్డెక్కాయి.
అనేక మంది నాయకులు.. పదవులు దక్కుతాయని భావించి.. భంగపడిన వారు.. కూడా.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిఇలాంటి సమయంలో వీరంతా పార్టీ మారిపోయి.. వైసీపీ అధినేతకు ఝలక్ ఇస్తార ని.. ఒక కీలక నాయకుడు తాజాగా వ్యాఖ్యానించడం వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది.
ముఖ్యంగా టీడీపీలోను, జనసేనలోనూ.. ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిస్తే.. గెలుపు ఖాయమనే ప్రచారం ఉంది. దీంతో అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ పిలిస్తే… వెళ్లిపోయేందుకు దాదాపు 50 మంది నాయకులు రెడీగా ఉన్నారని.. చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులతో భేటీ అయిన..జగన్ తన వ్యూహాన్ని వివరించడంతో పాటు.. పార్టీలో ఆధిపత్యానికి అవకాశం లేదని.. చెప్పారు. అంటే.. ఇప్పటి నుంచే ఆయన మానసికంగా.. ప్రిపేర్ అవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. దీని అర్ధం. మీరు ఉన్నా లేకున్నా.. పార్టీకి ఏం కాదని.. స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఎవరో ఒకరిద్దరు దూరంగా ఉన్నా.. పార్టీకి ఏమీ కాదని..త ర్వాత మీడియాతో మాట్లాడినా.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తే.. వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.