రాజకీయాలు అన్నాక సవాలచ్చ ఉంటాయి. ఎవరూ కాదనరు. కానీ.. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పుడు పెద్దగా బయటకు రాని ఇంట్లోని మహిళల్ని ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరును ఏమనాలి? తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి.. ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. పవన్ మూడో భార్య పై వైసీపీ నేతలు.. వారి అనుచర వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలు.. మహిళా గౌరవం గురించి.. వారి హక్కుల కోసం పోరాడినట్లు చెప్పుకునే వాసిరెడ్డి పద్మకు.. పవన్ సతీమణిని ఉద్దేశించి వైసీపీ మంత్రులు.. సొంత పార్టీ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరుపై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న వాసిరెడ్డి పద్మ.. ఏపీకి చెందిన వారి బాగోగులు.. మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తుంటే ఎందుకు చూస్తూ ఉంటున్నారు. పవన్ ఓటు ఏపీలోనే ఉంది. ఈ లెక్కన పవన్ సతీమణి ఏపీకి చెందిన మహిళగానే చెప్పాలి.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నందుకు అభినందించకపోయినా ఫర్లేదు. తాము చేయలేని పని పవన్ చేస్తున్నందుకు ఆయనకు పొలిటికల్ మైలేజీ వస్తుందన్న కసితోనో.. కోపంతోనో నోటికి వచ్చినట్లు మాట్లాడినా ఫర్లేదు. కానీ.. ప్రజాజీవితంలోకి రాని పవన్ సతీమణిని ఉద్దేశించి.. ఆమె పెళ్లికి ముందు జాతీయత గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఏమనాలి? ఎలా రియాక్టు కావాలి? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరి.. ఇలాంటి వారి ప్రశ్నలకు వాసిరెడ్డి పద్మగారి లాంటి వారు ఎందుకు స్పందించటం లేదు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పకుండా.. మహిళల హక్కుల కోసం పోరాడుతున్నానని వాసిరెడ్డి వారు ఆమె స్థాయికి ఏ మాత్రం సూట్ కావన్న విషయాన్ని ఆమె ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
Super acting @padma_vasireddy pic.twitter.com/igHiotSzgv
— వీరేంద్ర ???? Jana Sainik???????? (@VeerendraJSP) April 25, 2022
#TDPTwitter
Sandireddy VS @padma_vasireddy
????????????????????
@Bondauma_MLA @ncbn @JaiTDP @naralokesh @gayatri008_16 #APUnsafeforWomen pic.twitter.com/cmQsRpRn1y— Jakkampudi Chaitanya (TDP -✌????????????????) (@JakkampudiChai1) April 23, 2022