Congress-style secularism…
300-year-old Lord Shiva temple demolished in the name of development in Rajasthan’s Alwar. pic.twitter.com/T917ElFgCk
— Baburam Nishad ( Modi Ka Parivar ) (@BRNishadBJP) April 22, 2022
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా తెరమీదికి వస్తాయి. అప్పటి వరకు ఉన్న ముసుగులు సైతం నాయకులు తొలగించేసి.. ఫక్తు రాజకీయాలనే కోరుకుంటారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో నేతలు ఎవరికీ ఎవరూ శత్రువులు కారని.. ఎవరికి ఎవరూ మిత్రులు కూడా కారని.. ఒక ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి మించిన పరిణామాలు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. నాయకులే కాదు.. మతాలు.. కులాలు కూడా రాజకీయాల ముందు దిగడుపేనని అంటున్నారు.
అంటే రాజకీయాల కోసం.. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ను సైతం పక్కన పెట్టేందుకు నేతలు.. ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. హిందువులన్నా.. హిందూదేవుళ్లన్నా అసలు గిట్టని.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం.. మజ్లిస్ పార్టీ అధినేత.. అసదుద్దీన్ .. ఒక్కసారిగా హిందువుగా మారిపోయారు. వారిపై ప్రేమను కురిపించారు. హిందువులకు తాము అండగా ఉంటామన్నారు. వారిని అగౌరపరిస్తే సహించేది లేదని కూడా కుండబద్దలు కొట్టారు.
మొత్తానికి ఇంతగా ఆయన ఎందుకు అంత ప్రేమ చూపిస్తారనేది అసలు సందేహం. సరే.. తాజాగా ఏం జరిగిందో చూస్తే.. రాజస్థాన్‌లోని 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని ఇటీవల అధికారులు కూల్చేశారు. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. శివాలయం కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఉన్న 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చేశారని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని చెప్పారు. ఇది రాజ్‌గఢ్ మునిసిపాలిటీ పరిధిలో ఉందని, ఈ మునిసిపాలిటీ పాలక వర్గం బీజేపీదేనని చెప్తోందని తెలిపారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని చెప్పారు. మునిసిపల్ బోర్డు బీజేపీ నేతృత్వంలో ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. శివాలయాన్ని కూల్చేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణ యాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు. అంతేకాదు. హిందువులకు తాము అండగా కూడా నిలుస్తామన్నారు. అయితే.. అసదుద్దీన్ వంటి నాయకులు ఊరికేనే ఏదీ చేయరు కదా! వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.