పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి చిరు ఆచార్య ఫంక్షన్ కి వస్తాడని ప్రచారం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివకు చాలా ప్రియమైన స్నేహితుడు కావడంతో, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అతను కూడా పాల్గొంటారిన అందరూ భావించారు. అయితే అదేమీ జరగలేదు.
ఆచార్య యాక్టివిస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు టెంపుల్ టౌన్ సెటప్ మరియు స్క్రీన్‌పై చిరు-చరణ్ కలిసి ఉండటం వల్ల సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రావచ్చని అనుకున్నారు. పవన్ కి ఉన్న రాజకీయ కారణాలు, టూర్ల కారణంగా ఈ సినిమా వేడకకు హాజరుకాలేకపోయారు.
మరోవైపు ఆచార్య సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఆ తర్వాత రామ్ చరణ్‌తో పాటు కొరటాల శివతో మంచి స్నేహం ఉండడంతో ఈ ఈవెంట్‌కి తప్పకుండా హాజరవుతాడని అంతా అనుకున్నారు. అయితే, అటెన్షన్ డైవర్షన్ అనేది జరగకూడదు అని, పైగా ఇపుడు రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ కావడం వల్ల ఆచార్య సినిమాకు మహేష్ బాబు అవసం లేదని మెగా క్యాంప్ భావించిందట.
లేని పోని వివాదాలు రేపు డిబేట్లు పెట్టడంలో తెలుగు సినీ అభిమానులు ముందంజలో ఉంటారని చెప్పాలి.