ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన జాబ్ మేళాపై ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ జాబ్ మేళాకు రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోందంటూ విజయసాయితో పాటు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో, కియామోటార్స్ తదితర దాదాపు 147 కంపెనీలు ఈ జాబ్ మేళాలో యువతకు ఉద్యోగాలిస్తున్నాని డబ్బా కొట్టారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆ ట్వీట్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. ‘బోత్ ఆర్ నాట్ సేమ్’ అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ డైలాగుతో అయ్యన్న ఎద్దేేవా చేశారు. ‘కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో లాంటి కంపెనీలు తెచ్చి యువతకి నిఖార్సైన ఉద్యోగాలు కల్పించే రేంజ్ మా నేత చంద్రబాబు గారిది… అదే కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో కంపెనీల్లో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించే స్థాయి మీ నేత జగన్ రెడ్డిది. బోత్ ఆర్ నాట్ సేమ్’ అంటూ అయ్యన్న పాత్రుడు చురకలటించారు.
అంతకుముందు, విజయసాయి, జగన్ రెడ్డిల పదవులు పోయే రోజు దగ్గర పడిందని, ముందుజాగ్రత్త చర్యగా ఆ జాబ్ మేళా లో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోవాలని అయ్యన్న సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. బ్రోకర్ జూమాంజి ముందు నత్తి పకోడీ హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మేళా మొదలు పెట్టు అంటూ విజయసాయిపై అయ్యన్న సెటైర్లు వేశారు.
‘‘నువ్వు, మీ నాయకుడు టీడీపీ మొదలు చూసేలోపే మరోసారి జైల్లో చిప్పకూడు తినిపిస్తాం…టీడీపీ అంతు చూడటం మీ నాయకుడి బాబు వల్లే కాలేదు, నువ్వెంత? విశాఖలో వేసిన చిల్లర వేషాల కారణంగా అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని జగన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు 26 జిల్లాలు తిరుగుతా అని బీరాలు పలుకుతున్నాడు వీసా రెడ్డి. ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడు’’ అంటూ అయ్యన్న చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.