వైసీపీ సర్కారులో తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టడం రివాజుగా మారింది. నేడు ఏకంగా లోకేష్ తో పాటు చంద్రబాబుపై కేసు పెట్టడం సరికొత్త సంచలనం.
తనపై పోలీసుల కేసు నమోదు చేయడం పై నారా లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. తమపై నమోదైన కేసుపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలతో జగన్‌పైనా.. పోలీసులపైనా విరుచుకుపడ్డారు.
“ఇంత పిరికివాడివేంటి జగన్ రెడ్డి? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావు. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు పెట్టావు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నాపై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావు. నెక్స్ట్ ఏంటి? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా..? దేనికైనా రెడీ” అని ట్విటర్ వేదికగా సవాల్ చేశారు లోకేష్. దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.