నందమూరి బాలకృష్ణ మీద చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. ‘నరసింహ నాయుడు’ తర్వాత బాలయ్యకు సరైన విజయం లేక కెరీర్ తిరోగమనంలో పయనిస్తున్న సమయంలో ‘సింహా’తో మళ్లీ నట సింహాన్ని ట్రాక్‌లోకి తీసుకొచ్చిన ఘనత బోయపాటిదే. ఆ తర్వాత కూడా బాలయ్య కెరీర్ ఇబ్బందుల్లో ఉండగా ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలతో ఆయనకు పునర్వైభవాన్ని తెచ్చిన క్రెడిట్ కూడా బోయపాటిదే.
ఐతే బాలయ్యను తెరపై అంత బాగా చూపిస్తూ.. ఆయనలోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా వాడుకుంటూ.. అభిమానులతో పాటు అందరినీ మెప్పిచే సినిమాలు తీసే బోయపాటి.. వేరే హీరోలతో మాత్రం తన స్థాయికి తగ్గ చిత్రాలు తీయట్లేదు.
బాలయ్యతో బోయపాటి భారీ విజయం అందుకోగానే బోయపాటితో జట్టు కట్టడానికి వేరే స్టార్ హీరోలు లైన్ కట్టేస్తున్నారు. కానీ బాలయ్యకు ఇచ్చినట్లుగా బోయపాటి వారికి మాత్రం మెగా హిట్లు ఇవ్వలేకపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
కెరీర్ ఆరంభంలో రవితేజతో ‘భద్ర’ లాంటి సూపర్ హిట్ తీసిన బోయపాటి.. ఆ తర్వాత బాలయ్య కాకుండా హిట్ ఇచ్చిందంటే ఒక్క అల్లు అర్జున్‌తోనే. వీరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్‌ను తట్టుకుని నిలబడిరది. వెంకటేష్‌తో చేసిన ‘తులసి’ ఓ మోస్తరుగా ఆడితే.. ఎన్టీఆర్‌తో తీసిన ‘దమ్ము’ తుస్సుమనిపించింది.
ఇక రామ్ చరణ్‌తో బోయపాటి తీసిన ‘వినయ విధేయ రామ’ పెద్ద డిజాస్టర్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘జయ జానకి నాయక’ కూడా ఫ్లాపే. బాలయ్యతో సినిమా అనగానే తన శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా వాడి.. అభిమానులను అలరించే, మాస్కు పూనకాలు తెప్పించే సినిమాలు చేసే బోయపాటి.. వేరే హీరోల సినిమాల విషయానికి వచ్చేసరికి అంచనాలను అందుకోలేెకపోతున్నాడు.
ఇదొక నెగెటివ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. వేరే హీరోల ఇమేజ్‌కు, బోయపాటి ఇమేజ్‌కు మ్యాచ్ కాకపోవడమో.. బోయపాటి కథల్లో వాళ్లు సింక్ కాకపోవడమో.. ఇలా ఏదో ఒకటి సమస్యగా మారుతోంది. ఇప్పుడు ‘అఖండ’ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి.. యువ కథానాయకుడు రామ్‌తో జట్టు కడుతున్నాడు.
ఐతే బోయపాటి మార్కు ఊర మాస్ కథలకు.. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లకు రామ్ సూటవుతాడా అన్న సందేహం ఉంది. మరి బోయపాటి బొనాంజా బాలయ్యకే పరిమితం అనిపిస్తాడా లేక వేరే హీరోతోనూ తాను హిట్ కొట్టగలనని రుజువు చేస్తాడా అన్నది చూడాలి.