మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉంది ఏపీ ప్రస్తుత పరిస్థితి. ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులు.. అప్పుల కోసం వెతుకులాటలు తెలిసిన ఏపీ ప్రజలకు.. జగన్ పుణ్యమా అని.. అప్పుడెప్పుడో మర్చిపోయిన కరెంటు కోతల్ని గుర్తు చేసే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కలిసి వచ్చేటోడికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్న చందంగా.. ఇప్పటికే బోలెడన్ని దరిద్రాలతో కిందా మీదా పడుతున్న ఏపీ ప్రజలకు.. ఇప్పుడు కరెంటు కోతలకు మస్తు పరేషాన్ అవుతున్నారు.
తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. భయంకరమైన చెమటలతో చాలా ప్రాంతాల ప్రజలు కిందా మీదా పడిపోతున్నారు. ఇక.. ఏపీకి వెళ్లే ప్లాన్ ఉన్నోళ్లు.. ఈ పవర్ కట్స్ గురించి తెలిసిన తర్వాత తమ జర్నీ ప్లాన్ ను తర్వాత ఎప్పుడైనా ఆలోచిద్దామనే పరిస్థితికి వచ్చేశారు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం విద్యుత్ కోతల్ని అనుభవించిన చాలామంది.. అలాంటి సమస్యలు అప్పట్లో ఉండేవన్న విషయాన్ని మర్చిపోయారు.
అలా ఉన్నట్టుండి మర్చిపోతే అస్సలు బాగోదని అనుకున్నారేమో కానీ.. ప్రభుత్వ చేసిన తప్పులు.. అధికారుల నిర్ల్యం వెరసి.. ఏపీ ప్రజలు ఇప్పుడు కరెంటుకోతలతో హాహాకారాలు పెడుతున్నారు.
నగరాలు.. పట్టణాల్లోఐదారు గంటల పాటు వపర్ కట్ చేస్తే.. గ్రామాల్లో ఏకంగా తొమ్మిది పది గంటల పాటు కరెంటు కట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు వెళితే.. ఒక మూడు.. మూడున్నర గంటల పాటు ఎంచక్కా థియేటర్లో గడిపేయొచ్చన్న మాట కొందరు ఏపీ ప్రజల నోటి నుంచి రావటంచూస్తే.. విద్యుత్ కోతలతో వారెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
కరెంటు కోతల కారణంగా ఇప్పటివరకు సాదాసీదా ప్రజల గురించి.. వారు పడే అవస్థల గురించి మాత్రమే తెలుసు. అందుకు భిన్నంగా ఇప్పుడు వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు. పరిశ్రమలు ఏమైనా సరే.. ప్రస్తుతం ఉన్న పవర్ కొరత కారణంగా ఏకంగా రాష్ట్రంలోని పరిశ్రమలు ఏవైనా సరే.. రెండువారాల పాటు ఎలాంటి ఉత్పత్తిని చేపట్టకూడదని చెబుతున్నారు. దీనికి కారణం.. ఆ విద్యుత్ ను కూడా మామూలు అవసరాల కోసం వినియోగిచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.
రాష్ట్రంలోనిమూడు డిస్కమ్ ల పరిధిలో ఈ నెల 8 నుంచి 22 వరకు రెండు వారాలు పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించిన ఏపీ ట్రాన్స్ కో.. ప్రాసెసింగ్ పరిశ్రమలు మాత్రం50 శాతం విద్యుత్ ను వాడుకోవాచ్చని చెప్పింది. పరిశ్రమలకు వరాంలో ఒక రోజు పవర్ హాలీడే ఇస్తున్నామని.. ఇప్పటికే ఉన్న వీకెండ్ కు మరో రోజు అదనంగా పవర్ హాలీడేను ఇస్తూ ప్రకటన జారీ చేశారు. ఏమైనా.. పరిశ్రమలకు భారీ ఎత్తున పవర్ హాలీడే పుణ్యమా అని.. పరిశ్రమలు ఎలా బతకాలి? అన్నది ప్రశ్నగా మారింది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పవర్ హాలీడే ఏపీకి శాపంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.