సాక్షి ఎడిటర్ మురళీలలు -1
సాక్షిలో అవినీతి వర్థిల్లు మురళి
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వందల ఎకరాలు సంపాదించిన సాక్షి ఎడిటర్
-వికారాబాద్‌లో వర్థెల్లి మురళికి సొంత ఫామ్‌హౌస్..ఇక్కడే పైరవీలు, రాసలీలలు
తన యజమాని జగన్మోహన్రెడ్డి జనం సొమ్ము లక్షల కోట్లు దోచి పెట్టిన పత్రిక, మీడియా సంస్థ సాక్షి అని ఆ సంపాదకుడు బాగా గుర్తెరిగాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లతో సాక్షి మీడియా గ్రూప్ ఏర్పాటు చేశాడు. అవినీతి మానసపుత్రిక పెట్టిందే పందికొక్కులా ప్రజల సొమ్ము తినేందుకు అని నిర్ణయించుకుని అందులో చేరి, కెఎన్ వై పతంజలి మరణం కోసం ఎదురుచూసి పతంజలి లాంటి మేరునగధీరుడు కూర్చుకున్న ఎడిటర్ సీటులో కూర్చున్నాడు.
నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన మురళి తెలంగాణ ప్రాంతంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వందల ఎకరాల భూస్వామిగా ఎదిగిన అవినీతికి పత్రికే సాక్షి. తెలంగాణ రాష్ట్రం తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలోని నిరుపేద గీతకార్మిక కుటుంబంలో మైసయ్య, దుర్గమ్మ దంపతులకు పుట్టిన వర్థెల్లి బుచ్చిరాములు కమ్యూనిస్టుగా నిరాడంబర జీవితం గడిపాడు.
ఆయన తనయుడు వర్థెల్లి మురళి ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్‌లో అల్లం నారాయణకి అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు జేబులో డబ్బులు లేకుండా ఆఫీసుకొచ్చి, ఎవరో ఒకరి దగ్గర తీసుకున్న రోజులు బోలెడు. అటువంటి మురళి అవినీతిలో తన యజమాని జగన్‌రెడ్డిని మించిపోయాడు. వికారాబాద్‌లో అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ మురళి సొంతమైంది. ఏపీ, తెలంగాణల్లో ఇప్పటివరకూ 400 ఎకరాలు అత్యంత విలువైన భూములు సొంతం చేసుకున్నాడు మురళి
జీవితకాలం కమ్యూనిస్టుగా నిరాడంబరంగా నిజాయితీగా నిష్టగా బతికిన తండ్రి వర్థెల్లి బుచ్చిరాములు కీర్తి మసకబారేలా సాక్షి ఎడిటర్ వర్థెల్లి మురళి అవినీతి తిమింగలంలా మారి సాటి జర్నలిస్టుల్నీ మింగేస్తున్నాడు. సాక్షిలో పనిచేస్తూ అన్నివిధాలుగా అన్యాయానికి గురై ..బీసీ ముసుగులో వున్న భూస్వామి వర్థెల్లి మురళి టార్చర్ భరించలేక బయటకెళ్లిన మేము సాక్షిలో వున్న స్నేహితులు కలిసి అన్ని ఆధారాలతోనే ఈ కథనాలు రాస్తున్నాం.
సాక్షి సంపాదకుడు ఏ రేంజులో సంపాదిస్తున్నాడో ప్రజల్ని చైతన్య పరిచేందుకే ఈ కథనాలు. అవినీతి అనకొండ మురళీలీలలు అనంతం. అందుకే ఇది సీరియల్‌గా అందించాలని మా జర్నలిస్టుల బృందం నిర్ణయించింది.
సాక్షి ఎడిటర్ మురళీలలు -2
ఎడిటర్ మురళీది జగన్ అంత అవినీతి కుటుంబం
– సాక్షి మీడియా గ్రూపులో సంపాదకుడి కోటాలో మురళీ దింపిన దండుపాళ్యం గ్యాంగ్ 200 మంది
– వీళ్లంతా నెలనెలా మామ్మూళ్లు, ఏడాదికోసారి భారీ కానుకలు సమర్పించుకోవాల్సిందే
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నార్రా! అని పోకిరిలో మహేష్‌బాబు ఇలియానాని టీజ్ చేస్తాడు. అది రీల్ డైలాగ్. సాక్షిలో మాలాంటి సీనియర్ జర్నలిస్టుల మధ్య తరచూ వచ్చే రియల్ డైలాగ్ వినండి. సంపాదకుడు వర్థెల్లి మురళి కుటుంబం మొత్తం సాక్షిపై పడి బతికేస్తోంది. ఇదే ఆ రియల్ డైలాగ్. బంధుమిత్ర బినామీ కలెక్షన్ ఏజెంట్లనందరినీ సాక్షి మీడియా సంస్థలలో వివిధ విభాగాలలో అమర్చేశారు సకల కళా వల్లభ వర్థెల్లి మురళి.
వీళ్లంతా ఏం చేస్తుంటారంటే..జగన్‌రెడ్డి దోపిడీ చేసేందుకు కులం చూడం, మతం చూడం , ప్రాంతం చూడం అన్నట్టే…ఆయన సంపాదకుడు మురళీ గ్యాంగులు బ్లాక్మెయిల్, దందాలకి కుల మత ప్రాంత భేదాలేవీ చూడవు. పంచాయతీలు, సెటిల్మెంట్లన్నీ వీళ్ల కనుసన్నల్లోనే. సాక్షిమీడియాని అడ్డుపెట్టుకుని పంచాయతీ చేయగా వచ్చే దందా సొమ్ములో సంపాదకుడు మురళి వాటా నెలకి కోట్లలోకి చేరింది.
సాక్షిలో ఎటువంటి కులం బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా వచ్చిన మేము, మురళితో సమానమైన సీనియారిటీవున్న మేం ఆయన కంటే బాగా పని చేయగలం. కానీ మాలాంటి వారినంతా తొక్కేసిన ఎడిటర్, తన బినామీలు, బంధుగణాన్నంతా దింపేశాడు.
మురళి కజిన్ వర్థెల్లి వెంకటేశ్వర్లు రెండు రాష్ట్రాలలో చేసే దందాలన్నీ సాక్షి ఎడిటర్ కోసమేనని వేరే చెప్పక్లర్లేదు. ఆర్సీఆర్ అనబడే రామచంద్రారెడ్డి అనే జర్నలిస్టు ముసుగులో వున్న కాల్‌మనీ వ్యాపారి ఎడిటర్ మురళి స్లీపింగ్ పార్టనర్. ఆ రామచంద్రారెడ్డికి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ సులువుగా వచ్చేస్తుంది. ఏ బీట్ కావాలంటే అది ఏరికోరి తీసుకోవచ్చు. ఎడిటర్ మురళి సాక్షి మీడియా సంస్థలలో దింపిన 200 మందికి పైగా బంధుమిత్ర సపరివార గణమంతా క్విడ్‌ప్రోకో బ్యాచ్యే.
వీళ్లంతా చేసే దందాలలో సింహభాగం సంపాదకుడి సంపాదన ఖాతాలో చేరుతోంది. మురళికి అత్యంత ఇష్టుడైన విజయ్‌కుమార్ అనే జర్నలిస్టు.. ఇంకా ఘనాపాఠీ. ఎడిటర్ మురళీకి సమర్పించుకోవడానికి వసూళ్లు చాలక ఒక ఏడాదిలో తన కూతురికి మూడుసార్లు పుట్టినరోజు చేసి…ఒక్కో సాక్షి విలేకరి బంగారు ఉంగరాలు, చైన్లు సమర్పించుకోవాలని హకుంలు జారీ చేశాడంటే…ఎడిటర్ మురళీ దించిన 200 మంది దండుపాళ్యం గ్యాంగు దందా ఏ రేంజులో ఉందో కళ్లకు కడుతుంది.———సశేషం
I’m curious to find out what blog platform you happen to be working with?
I’m experiencing some minor security problems with my latest site and I’d like to find something more risk-free.
Do you have any recommendations?