తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ప్రాదుర్భవించిన.. తెలుగు దేశం పార్టీకి 40 వసంతాలు పూర్తవుతున్నా యి. ఒక ప్రాంతీయ పార్టీగా.. అందునా.. భిన్నమైన మనస్తత్వాలు.. విభిన్నమైన ఆలోచనలు ఉన్న తెలు గు నేలపై.. ఇన్నేళ్లపాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుకోవడం.. 22 సంవత్సరాలపాటు (ఎన్టీఆ ర్+చంద్రబాబు) అధికారంలో ఉండడం.. అంటే.. మాటలు కాదు.
అంతేకాదు… పొరుగు రాష్ట్రాలను చూసుకుంటే.. ఇలా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు వచ్చి.. చీలికలు పేలికలు అయిన పరిస్థితి ఉంది. కానీ, టీడీపీలో అలాంటి పరిస్థితి లేకుండా.. నిలదొక్కుకోవడం విశేషమే.
పార్టీని జాతీయస్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా.. ప్రధానులను నిర్ణయించడంలోనూ..కేంద్రంలో పాలక పక్షాల ఏకపక్ష విధానాలను ఎండగట్టి.. ప్రాంతీయ పార్టీలను సమైక్యం చేయడంలోనూ.. టీడీపీ చూపిన చొరవ నభూతో.. అన్నవిధంగానే సాగింది.
అన్నగారి హయాం నుంచి చంద్రబాబు వరకు.. టీడీపీ అంటే.. ఒక ఐకాన్. పైగా.. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను చూసుకుంటే.. అనేక అవినీతి మరకలు అంటించుకు న్నవారు ఉన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత.. అవినీతి కూపంలో చిక్కుకుని జైలు పాలయ్యారు.
ఆర్జేడీ అధినేత.. లాలూప్రసాద్ యాదవ్.. అవినీతిలో కూరుకుపోయి.. జైలు జీవితం గడుపుతున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబుసొరేన్ కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇలా.. మరో రెండు మూడు ప్రాంతీయ పార్టీల నేతలు.. అవినీతికి పాల్పడి పేరు పోగొట్టుకున్న పరిస్థితి ఉన్నప్పకీ.. తెలుగుదేశం పార్టీ కి అలాంటి అవినీతి మరకలు అంటకుండా.. 40ఏళ్లపాటు నవనవోన్మేషంగా నడిపించడం నిజంగా ప్రశంసనీయం.
పుబ్బలో పుట్టి.. పున్నమిలో కలిసిపోయిన పార్టీలు అనేకం ఉన్నా.. టీడీపీ అలా కాలేదు అంటే.. పార్టీకి అధ్యక్షత వహించిన నాటి ఎన్టీఆర్ అయినా.. ప్రస్తుత చంద్రబాబు అయినా.. ప్రజాపక్షం వహించడమే కారణం.
మరీ ముఖ్యంగా బీసీలకు అవకాశాలు కల్పించడం.. ప్రాతీయంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం.. పార్టీకి కలిసి వచ్చింది. జాతీయస్థాయిలో నాడు ఎన్టీఆర్కు తర్వత.. చంద్రబాబు కు కూడా ప్రధాని అయ్యే అవకాశం లభించింది. అయినప్పటికీ.. వీరు వాటిని సున్నితంగా తిరస్కరించి.. తెలుగు నేల సేవకే పరిమితయ్యారు.
మరోవైపు.. పాలనలోనూ.. ప్రగతి శీలతకు ప్రాధాన్యం ఇవ్వడం.. మహిళలు కేంద్రంగా తీసుకువచ్చిన.. ఆస్తి హక్కు అన్నగారికి ఎనలేని పేరు తీసుకురాగా.. డ్వాక్రా సంఘాలు… స్వయం శక్తి సంఘాలు.. అంటూ.. చంద్రబాబు మహిళా సాధికారతకుకన్న కలలు … సఫలీకృతం కావడం.. గమనార్హం. మొత్తంగా చూస్తే.. పార్టీ 40 ఏళ్ల వసంతం.. ఒక చరిత్ర అయితే.. భవిష్యత్తు.. మరో అధ్యాయంగా మారాలని.. టీడీపీ అభిమానులు ఆశిస్తున్నారు