తిరుపతిలో తెలుగుదేశం పోలీసుల అనుమతి తీసుకుని ప్రారంభించిన ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకోవడంపై తెలుగుదేశం నేత నారా లోకేష్ మండిపడ్డారు.
ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎం జగన్ కి ఎందుకంత కోపం? అన్ని మతాలను సమానంగా చూడమని అడిగితే ఎందుకంత అసహనం? టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకి నిన్న ఇచ్చిన అనుమతి ఈ రోజు ఎందుకు రద్దయ్యింది? అని ప్రశ్నించారు.
దేవాలయాలపై దాడులు, దళితుల పై దమనకాండ, అన్నదాతల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేపడుతున్న ధర్మ పరిరక్షణ యాత్రకి జగన్ రెడ్డి మతం రంగు ఎందుకు పూస్తున్నారు?
ధర్మాన్ని కాపాడమని అడిగినందుకు టిడిపి నేతల అక్రమ నిర్బంధం, కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని కుట్రలు చేసినా ధర్మ పరిరక్షణ కోసం టిడిపి పోరాటం ఆగదు.
విజయవాడలో వైసీపీ పబ్లిసిటీ స్టంట్!
ఈరోజు జగన్ విజయవాడలో పబ్లిసిటీ కోసం మొత్తం ట్రాఫిక్ ని అంతా ఆపేసి బియ్యం పంపిణీ వాహనాలు ప్రారంభించారు. ఇది ఆర్థికంగా ప్రజలకు భారంచేసే పని. ఎందుకంటే ఏ ఊర్లో అయినా ఊరంతా తిరిగి రావడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. రేషన్ బియ్యం ఇంటికి తెచ్చి ఇవ్వడం వల్ల డీజిల్ ఖర్చు, వాహనం ఖర్చు తప్పు… ప్రజలకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదు. మళ్లీ ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చయినా ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేయాల్సిందే. ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విచిత్రం. అన్నీ అనాలోచిత చర్యలే.