హెడ్డింగ్ చదివితే… చాలా విచిత్రంగా అనిపించింది కదా. బీజేపీ ఏపీలో యాత్ర చేస్తుంటే… వాళ్లు పర్మిషన్ కోసం సీఎం దగ్గరకు రావాలి గాని… సీఎం ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ ఇచ్చి రావడం ఏంటి అని… ??
ఏపీలో అంతా రివర్సే. టెండరింగ్ రివర్సే. పాలన రివర్సే. కంపెనీలు రివర్సే… మరి అలాంటిపుడు ఇది కూడా అంతే కదా. ఏపీలో బీజేపీ దన్నుతో వైకాపా ప్రభుత్వం నడుస్తుందని ప్రతి ఒక్క పౌరుడుకి బహిరంగంగా అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి జగన్ కోరిన ప్రతి ఫైలును బీజేపీ గవర్నర్ ఆమోదిస్తారు.
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బీజేపీ పెద్దలు కోర్టుల్లో కౌంటర్లు వేస్తారు
బీజేపీ ఎదగడానికి అవసరమైన అన్ని రాజకీయ పరిణామాలను వైసీపీ ప్రభుత్వం కలిగేలా చూస్తుంది.
బీజేపీ వైకాపా ఒకటి కాదు అంటే ఇవన్నీ చూశాక ఎవరికి మాత్రం నమ్మాలని అనిపిస్తుంది. మరలాంటపుడు తమకు అండగా ఉన్న పెద్దలు యాత్ర చేస్తాను అంటే… వాళ్లు వచ్చి పర్మిషను అడగాల్నా సీఎంను.
కాకితో కబురంపితే ప్రత్యేక విమానంలో వెళ్లి ముఖ్యమంత్రి అవసరమైన పర్మిషన్లను ఢిల్లీ పెద్దలకు ఇస్తారు. ఒక శాలువా, పూలదండ, దేవుడి విగ్రహం కూడా జ్జాపికగా ఇచ్చి వస్తారు.
ఇందులో భాగంగా… ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లని వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. సీఎం బృందంలో వీరిద్దరే కాకుండా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ ఏజీ జాస్తి నాగభూషణ్ కూడా ఉన్నారు. ఈ జాస్తి వెళ్లడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఈ సందర్భానికి జాస్తి వెళ్లడానికి సింక్ అవడం లేదు.
పైగా హోంమంత్రి అమిత్ షా వద్దకు న్యాయనిపుణుడిని తీసుకుని వెళ్లడం, ఇటీవలే సుప్రీంకోర్టులో జగన్ లేఖ గురించి హడావుడి జరగడం, ఏపీలో హడావుడి… అంతా సింక్ అవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవన్నీ ఓకే గాని మన ముఖ్యమంత్రి గారు ప్రత్యే క హోదా గురించి అడిగి వస్తారని మనం ఆశిద్దాం. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు బీజేపీ చేస్తున్న యాత్రకు అనుమతి ఇవ్వబోతున్నందుకు ప్రతిగా ఈ మాత్రం అయినా ఒక కోరిక కోరాలిగా…!!