అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇది ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ అని చెప్పాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏం లేదన్న హైకోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు.
కిలారు రాజేష్‌తో పాటు మరికొందరిపై ఈ కేసు నమోదైంది. అమరావతిలో భూములు ముందుగానే కొని లబ్ధి పొందారన్నది ప్రభుత్వం ఆరోపణ. అయితే భూములు అమ్మినవారు ఎవరు ఫిర్యాదు చేయలేదని, కేసు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు మాత్రమే అని హైకోర్టులో కిలారు రాజేష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
భూములు అమ్ముకున్న వారు ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా పెడతారని రాజేష్ తరుఫు న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ అంశంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని విచారణ అనంతరం హైకోర్టు పేర్కొంది. ఇన్సైడ్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని కూడా ధర్మాసనం వెల్లడించడం సంచలనం అవుతోంది.