తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాటిమాటికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చాలెంజ్ చేయటం, నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడుతూ రేవంత్ ను ఇరిటేట్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. సంగారెడ్డి ఎంఎల్ఏ పదవికి తాను రాజీనామా చేస్తానని రేవంత్ దమ్ముంటే తనపై అభ్యర్ధిని పెట్టి గెలిపించుకోవాలని చాలెంజ్ చేశారు.
తనను ఎవరు ఏమీ పీకలేరంటు తాజాగా జగ్గారెడ్డి చేసిన ఛాలెంజ్ కు పీసీసీ స్పందించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగ్గారెడ్డికి ఉన్న అదనపు బాధ్యతల నుండి తక్షణమే తొలగించేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగ్గారెడ్డి ఇప్పటివరకు పార్టీ అనుబంధ సంఘాలు, పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను చూస్తున్నారు. తాజా పరిణామాల్లో జగ్గారెడ్డి కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని పార్టీ ప్రకటించింది.
పీసీసీ అధ్యక్షుడిగా చాలామంది లాగే జగ్గారెడ్డి కూడా ప్రయత్నం చేసుకున్నారు. అయితే అధిష్టానం రేవంత్ కు పగ్గాలు అప్పగించింది. అప్పటినుండి రేవంత్ అంటే జగ్గారెడ్డికి మంటగా ఉంది. అందుకనే ఏదో కారణం పెట్టి రేవంత్ ను రెచ్చగొడుతున్నారు. పనికిమాలిన కారణాలను చూపి పార్టీని కంపు చేస్తున్నారు. సంగారెడ్డి ఎంఎల్ఏగా జగ్గారెడ్డికి పట్టుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతమాత్రాన పార్టీ పరువును బజారుకీడ్చాల్సిన అవసరం లేదు.
జగ్గారెడ్డికన్నా బెటర్ ఛాయిస్ అని అధిష్టానం అనుకోబట్టే రేవంత్ కు పగ్గాలు అప్పగించింది. దీన్ని కూడా జగ్గారెడ్డి తట్టుకోలేక కంపు కంపు చేస్తున్నాడు. సంగారెడ్డి ఎంఎల్ఏ కంపు ఇలాగే కంటిన్యు చేస్తే రేపు ఇంకేమి యాక్షన్ తీసుకుంటారో తెలీదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగ్గారెడ్డి చూపు టీఆర్ఎస్ వైపుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. తొందరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశముందంటున్నారు. బహుశా అందుకనే ఏమో పార్టీని కంపు చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.