టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పాపులర్ అయిన నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంగానీ, సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడంగానీ చేయలేదు. ఎవరి మానాన వారు…తమ నిర్ణయాన్ని గౌరవిస్తూ బతికేస్తున్నారు. అయితే, తాజాగా చైతూకు సంబంధించి సమంత సోషల్ మీడియాలో చేసిన పని ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నాగ చైతన్యను సమంత అన్ ఫాలో చేయడంపై నెటిజన్లు రచ్చబండ చర్చ మొదలుబెట్టారు. ఆల్రెడీ తన ఇన్ స్టా ఖాతా నుంచి చైతూ ఫొటోలను డిలీట్ చేసిన సమంత…తాజాగా చైతూను అన్ ఫాలో చేయడంపై నెట్టింట డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే, చైతూను అన్ ఫాలో చేసిన సామ్…నాగార్జున, వెంకటేశ్, వెంకటేశ్ కూతురు అశ్రిత, దగ్గుబాటి రానాలను మాత్రం ఫాలో అవుతుండడం మరో చర్చకు దారి తీసింది.
ఇంత జరుగుతున్నా…సమంతను మాత్రం నాగ చైతన్య ఫాలో అవుతూనే ఉండడం కొస మెరుపు. తన ఫొటోలను ఇన్ స్టా నుంచి సమంత డిలీట్ చేసినా…సమంతతో కలిసి ఉన్న ఫొటోలను చైతూ మాత్రం డిలీట్ చేయకపోవడం విశేషం. ఇక, వీరిద్దరి బాటలోనే విడాకులు తీసుకోబోతోన్న కోలీవుడ్ క్యూట్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు మాత్రం ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఐశ్వర్య ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్ట్ కు స్పందించిన ధనుష్…ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ అంటూ పోస్ట్ పెట్టడం…దానికి ఐశ్వర్య కూడా థ్యాంక్యూ చెబుతూ రిప్లై ఇవ్వడం తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.