సీఎం అయిన తర్వాత ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబీఎన్ న్యూన్ ఛానెల్ పై జగన్ కక్ష కట్టారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం హోదాలో తన సొంత పత్రిక సాక్షికి, సాక్షి న్యూస్ చానెల్ కు దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రకటనలిచ్చారని, అదే సమయంలో తమ మీడియా సంస్థకు ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరా రాధాకృష్ణ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మూడేళ్లలో తమ పత్రికకు జగన్ వల్ల దాదాపు రూ.250 కోట్లు నష్టం వాటిల్లిందని, అంత మేర ప్రకటనల ఆదాయాన్ని కోల్పోయామని ఆర్కే విమర్శించారు. ఇలా ఏ మాత్రం మన ‘స్సాక్షి’ లేకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ వందల కోట్లు గడిస్తున్న జగన్…తమ సంస్థలోని ఉద్యోగుల జీతాల విషయంలో మాత్రం పెద్దమనసు చేసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఏటా దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రకటనలు సాక్షి సంస్థకు జగన్ కట్టబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, అంత ఆదాయం వస్తున్నా..సాక్షి సంస్థలోని ఉద్యోగులకు మాత్రం జీతాలు పెరడగం లేదన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అంత ఆదాయం ప్రకటనల రూపంలో వస్తున్నప్పటికీ ఆ పత్రిక సర్క్యులేషన్ నానాటికీ దిగజారిపోతోందని మీడియా సర్కిళ్లలో టాక్ వస్తోంది.
సాక్షి సంస్థ నష్టాల్లో ఉందని, అందుకే అంత ఆదాయం యాడ్స్ రూపంలో వస్తున్నప్పటికీ…ఉద్యోగుల జీతాలు పెరడగం లేదని చర్చ జరుగుతోంది.
అందుకే, సాక్షి పత్రిక సర్క్యులేషన్ ను పెంచేందుకు బంపర్ ఆఫర్ లు ఇస్తున్నారని టాక్ వస్తోంది. కాపీల సంఖ్య పెరిగితే చాలు అన్న రీతిలో వినూత్న స్కీమ్‌లకు తెర తీసి రూ. వెయ్యి చందా కడితే ఏడాది పాటు సాక్షి పత్రిక వేస్తామంటూ అనధికార ప్రచారం జరుపుతున్నారన్న వదంతులు వస్తున్నాయి.
సుమారు రూ.1500-2000 వరకు ఉండే సంవత్సర చందా రుసుమును 1000 రూపాయలకే తగ్గించడం వల్ల సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని అంటున్నారరు. సర్క్యులేషన్ రేసులో నిలబడేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా ఆఫర్ లు ప్రకటిస్తున్నారని, నష్టాలను ఎలాగోలా భర్తీ చేసుకోవచ్చన్న యోచనలో యాజమాన్యం ఉందని టాక్. అందుకే, యాడ్స్ రూపంలో వందల కోట్ల ఆదాయం వస్తున్నా…ఉద్యోగుల జీతాలు పెరగడం లేదని ప్రచారం జరుగుతోంది.