టాలీవుడ్ ప్రముఖ గాయనిలలో ఒకరుగా వెలుగొందుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ‘సునీత’ జనవరి 9 న ప్రముఖ మీడియా వ్యాపారవేత్త మ్యాంగో ‘రామ్ వీరపనేని’ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .అయితే పెళ్లి తర్వాత పలు వార్తలు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి వైరల్ అవుతున్నాయి . పిల్లలతో కల్సి ఆనందంగా ఉన్న ఫోటోలు మొదలు వీరి గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి .తాజాగా రామ్ వీరపనేని ఆస్తుల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది .డిజిటల్ మీడియాలో ఎన్నో ఏళ్ల నుంచి పాతుకుపోయిన మ్యాంగో అధినేత రామ్ వీరపనేనితో సింగర్ సునీత పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమతో పెళ్లికి దారితీసింది .ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చిన రామ్ మొదట్లో సినిమాల్లో నటించాడు .జగపతిబాబు స్వప్నలోకం,వెంకటేష్ జయం మనదేరా, మహేష్ బాబు బాబీ లాంటి సినిమాల్లో రామ్ నటించాడు.ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేసి,వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు . ఈయన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి .
ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రాజకీయ నాయకులతో కూడా రామ్ కి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు రామ్ కి ఉన్నట్లు టాక్.ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇతర భాషల నుంచి తీసుకుని మ్యాంగోలో విడుదల చేసాడు.అలా కోట్లాది రూపాయలను సంపాదించాడు.మాంగో మ్యూజిక్ కు సునీత ఎన్నో పాటలు పాడింది.అలా వీళ్లిరి మధ్య మంచి స్నేహం చిగురించింది.ఆ తర్వాత సునీత స్వయంగా ప్రపోజ్ చేయడంతో పెళ్లి పీటలు ఎక్కింది .