జంగారెడ్డిగూడెం కల్తీ సారా అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వరుసగా ఐదు రోజుల పాటు అసెంబ్లీలో నానా గందరగోళం జరిగింది. ఆ మరణాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతోంటే…వైసీపీ సభ్యులు మాత్రం అవి సహజ మరణాలని, సారా తాగి చనిపోతే తమకేం సంబంధమని తప్పించుకుంటున్నారు. ఇక, జగన్ అయితే 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం వంటి పట్టణ ప్రాంతంలో నాటు సారా కాయడం సాధ్యపడుతుందా..? అంటూ భేతాళ హాస్యాస్పదమైన ప్రశ్నను సంధించడంపై కూడా విమర్శలు వచ్చాయి.
నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యం కాదన్న జగన్ వాదనపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరిగింది. కల్తీ సారా, నాటు సారా కాయాలంటే జనాభా ఇంతమందే ఉండాలని రాజ్యాంగంలో రాసుందా అంటూ జగన్ పై నెటిజన్లు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో నాటు సారా కాయడం, అక్రమ మద్యం వాడకం వంటి వ్యవహారాల్లో జగన్ చెప్పినవి అవాస్తవాలన్న గుట్టు రట్టయింది. గత నాలుగు రోజుల్లోనే నాటు సారా కాసేవారిపై ఏపీ మొత్తంగా ఏకంగా 1129 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం బుకాయింపులు బట్టబయలయ్యాయి.
జంగారెడ్డిగూడెంలో నాటు, కల్తీ సారా మరణాలు నమోదైన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ నెల 10వ తేదీ నుండి 14 వతేదీ వరకు రాష్ట్రంలోని నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేశారు. దీంతో, కేవలం 4 రోజుల్లోనే 1129 కేసులు నమోదు చేసి 677 మంది నాటుసారా తయారీదారులను అరెస్టు చేశారు. నాటు, కల్తీసారా తయారీకి ఉపయోగించే 5,76,710 లీటర్ల పులియ బెట్టిన బెల్లపు ఊటను కూడా ఎస్ఈబీ పోలీసులు ధ్వంసం చేశారు. 13,471 లీటర్ల నాటుసారాతోపాటు 47 వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ జగన్ పై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు చెబుతున్న కాకి లెక్కలు కావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఎస్ఈబీ అధికారులు అధికారికంగా వెల్లడించిన గణాంకాలు.
ఇక, నాటుసారా కాయడం అసాధ్యం అని జగన్ చెప్పిన జంగారెడ్డిగూడెం పరిధిలోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. ఏపీలో మద్యపాన నిషేధ బూటకం, నాసిరకం బ్రాండ్లతో నాటకం, వైసీపీ నేతల సొంత కంపెనీ పితలాటకం…వెరసి నాటుసారా రాష్ట్రంలో ఏరులైపారుతోంది. మరి, ఈ గణాంకాలు చూసిన తర్వాతైన జంగారెడ్డిగూడెంలోనూ నాటుసారా కాస్తారని జగన్ నమ్ముతారో లేదో వేచి చూడాలి. ఈ ఘటనతో జగన్ కు ఎస్ఈబీ షాకిచ్చిందని,…నాటు..నాటు…