జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉపాధ్యాయులంతా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఛలో విజయవాడ తర్వాత ఉపాధ్యాయులు మినహా మిగతా ఉద్యోగ సంఘాల నేతలను సమ్మె విరమించేలా ఒప్పించడంలో జగన్ సఫలమయ్యారు. అయితే, ప్రభుత్వానికి తలొగ్గిన పీఆర్సీ సాధన సమితి నిర్ణయంతో విభేదించిన ఉపాధ్యాయులు సమ్మెకే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది.
ఉపాధ్యాయ సంఘాల నేతలను కూడా సీఎంతో మాట్లాడిస్తామని చెప్పినా వారు వినలేదు. అంతేకాదు, మిగతా ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వెళ్లిపోవడంతో వారు ప్రభుత్వంపై పోరును కొనసాగిస్తున్నామనే సంకేతాలిచ్చారు. పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇంకా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్లు సంచలన ప్రకటన చేశారు.
పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దులకు సంబంధించి జగన్ సర్కారుకు యూటీఎఫ్ తాజాగా డెడ్ లైన్ విధించింది. మార్చి 31లోగా ఆ రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం వెల్లడించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని యూటీఎఫ్ హెచ్చరించింది. అనంతపురం వేదికగా జరుగుతున్న యూటీఎఫ్ మహాసభల్లో ప్రభుత్వంపై ఆ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశఆరు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.
కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా…జగ