ముచ్చటగా రూ.3లక్షల కోట్లు.. కాదు రూ.2.70లక్షల కోట్లు ఇలా వెలువడిన అంచనాలకు భిన్నంగా.. అందరూ వేసిన లెక్కకు కాస్త తక్కువగా ఉండేలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఆర్థిక మంత్రి హోదాలో ఆయన మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ రూ.2.56లక్షల కోట్లు ఉండేలా డిసైడ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా రూపొందుతోందని.. పారదర్శక విధానాలతో ఆదాయాన్ని పెంచుకున్నట్లుగా పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆగచాట్లు పడిందని.. పోరాటం నుంచి ఆవిర్భవించిన తెలంగాణ సరికొత్త రూపం సంతరించుకుంటోందని.. సవాళ్లు.. క్లిష్టమైన సమస్యల్ని తాము అధిగమించినట్లుగా పేర్కొన్నారు. పాలనలోరాజీ లేని వైఖరిని అనుసరిస్తున్నట్లుగా చెప్పిన హరీశ్.. తెలంగాణలో ఇప్పుడు కరెంటు కోతలు.. ఆకలి చావులు లేవని పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం టార్చ్ బేరర్ గా మారిందన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ మార్క్ బడ్జెట్ గా పేర్కొన్నారు.
రైతు బంధు మొదలుకొని.. ఏ పథకమైనా లబ్థిదారులకు చెందుతుందన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం దాడి మొదలు పెట్టిందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏడు మండలాల్ని ఏపీకి అక్రమంగా బదలాయించిందంటూ కేంద్రం మీద విరుచుకుపడిన తీరు చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ఎజెండాలో మంత్రి గారి బడ్జెట్ ప్రసంగంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు.
రైతు బంధు మొదలుకొని.. ఏ పథకమైనా లబ్థిదారులకు చెందుతుందన్న ఆయన.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం దాడి మొదలు పెట్టిందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఏడు మండలాల్ని ఏపీకి అక్రమంగా బదలాయించిందంటూ కేంద్రం మీద విరుచుకుపడిన తీరు చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ఎజెండాలో మంత్రి గారి బడ్జెట్ ప్రసంగంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు.
బడ్జెట్ లోని హైలెట్స్ ను చూస్తే..
తెలంగాణ బడ్జెట్ మొత్తం (ప్రతిపాదన) రూ.2.56 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
ఇరిగేషన్ శాఖకు రూ. 22675 కోట్లు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు
అసరాకు రూ.11728 కోట్లు
తెలంగాణ పోలీస్ శాఖకు రూ. 9315 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 5698 కోట్లు
మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.2750 కోట్లు
రోడ్లు భవనాల శాఖకి రూ.1542 కోట్లు
పర్యాటక రంగానికి 1500 కోట్లు
గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు
పామాయిల్ సాగుకు రూ.వెయ్యి కోట్లు
హరితహారానికి రూ.932 కోట్లు
అటవీ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 117 కోట్లు కేటాయింపు
యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు
క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
ఇరిగేషన్ శాఖకు రూ. 22675 కోట్లు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు
అసరాకు రూ.11728 కోట్లు
తెలంగాణ పోలీస్ శాఖకు రూ. 9315 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 5698 కోట్లు
మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.2750 కోట్లు
రోడ్లు భవనాల శాఖకి రూ.1542 కోట్లు
పర్యాటక రంగానికి 1500 కోట్లు
గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు
పామాయిల్ సాగుకు రూ.వెయ్యి కోట్లు
హరితహారానికి రూ.932 కోట్లు
అటవీ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 117 కోట్లు కేటాయింపు
యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
ఆరోగ్యానికి పెద్దపీట
బడ్జెట్ సందర్భంగా పలు వరాల్ని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల్, యాదాద్రిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
– బస్తీ దవాఖాలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది
– కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు
– ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
– వరంగల్‌లో హెల్త్ సిటీ
– అవయవమార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షలు
– ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
– ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంచాం
– వైరస్ వ్యాప్తి కట్టడిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది
– కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు
– ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
– వరంగల్‌లో హెల్త్ సిటీ
– అవయవమార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షలు
– ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
– ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంచాం
– వైరస్ వ్యాప్తి కట్టడిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది
సొంత ఇంటి కలను తీరుస్తాం
సొంతింటి కలను తీర్చేందుకు ఇప్పటికే లక్షలాది డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..తాజా బడ్జెట్ లోనూ భారీగానే నిధులను సమకూర్చటం తెలిసిందే. డబుల్ బెడ్రూం ఇళ్ల మీద ఆధారపడకుండా సొంత స్థలాల్లో ఇంటిని నిర్మించుకునే వారికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేటాయింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక.. అసెంబ్లీ నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొత్తం మొత్తం ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు ఉంటాయని.. నిర్వాసితులు.. ప్రమాద బాధితులకు 43వేల ఇళ్లనుకేటాయిస్తున్నట్లు చెప్పారు.
రైతన్నకు అండగా..
తమది రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్ని ప్రతిబింబించేలా బడ్జెట్ లో పలు అంశాల్ని ప్రస్తావించారు. రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామన్న తీపికబురు ప్రకటించారు. తెలంగాణలో ఊహకందని రీతిలో పంటల దిగుబడి ఉందని.. రాష్ట్రం అమలు చేస్తున్న రైతు బంధును ఐక్యరాజ్యసమితి కూడా అభినందించిందన్నారు. వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం నుంచి 29 శాతానికి పెరిగిందని.. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
తెలంగాణ దూసుకెళుతోంది..
ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్న హరీశ్ దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఎలా దూసుకెళుతోందన్న విషయాన్ని వివరిస్తూ.. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువని.. 2015-16 నంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి సాధించారన్నారు. 2021-22 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా పేర్కొన్నారు.
ఆదాయం పద్దు ఇలా..
తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏయే మార్గాల్లో వస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లుగా వెల్లడించిన బడ్జెట్ ప్రసంగంలో.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనా వేశారు.
పన్ను ఆదాయం రూ.1,08,212 కోట్లు
కేంద్ర పనుల్లో వాటా రూ.18,394 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు
గ్రాంట్లు రూ.41,001 కోట్లు
రుణాలు రూ.25,970 కోట్లు,
అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు
కేంద్ర పనుల్లో వాటా రూ.18,394 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.25,421 కోట్లు
గ్రాంట్లు రూ.41,001 కోట్లు
రుణాలు రూ.25,970 కోట్లు,
అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు
బడ్జెట్ లోనూ కేంద్రాన్ని వదల్లేదు
ఇటీవల కాలంలో కేంద్రం మీద గురి పెట్టిన తెలంగాణ రాష్ట్ర సర్కారు.. బడ్జెట్ సందర్భంగానూ వదల్లేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ తెలంగాణకు కేంద్రం కారణంగా జరిగిన నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేయటం గమనార్హం. తెలంగాణలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు ఖర్చుచేశామన్నారు. నమ్మక్క- సారక్క బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని.. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి 5 నెలలైనా కేంద్రం ఇప్పటికి క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.