ఎంత పెద్ద రాజకీయ నేత అయినా.. జనాలకు కోపం రానంత వరకే. తమను అభిమానించి.. తమ చేతికి అధికారం ఇచ్చిన ప్రజల విషయలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఎమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం రావటం ఖాయం.
తాజాగా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులతో తియ్యటి మాటలు చెప్పి.. వారిని శాంతింపచేసి ఉంటే సీన్ ఎలా ఉండేదో కానీ.. అధికారం చేతిలో ఉన్న ఎమ్మెల్యే కావటంతో గ్రామస్తులు ఆగ్రహానికి ప్రతిగా మరింత మండిపాటును ప్రదర్శించి అడ్డంగా బుక్ అయిన ఉందతంగా దీన్ని చెప్పాలి.
తూ.గో.: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం – వంతెన నిర్మించాలని ఎమ్మెల్యేను కోరిన ఉచ్చులవారిపేట గ్రామస్తులు – వంతెన నిర్మాణం సాధ్యంకాదంటూ ఎమ్మెల్యే అసహనం – ఎమ్మెల్యే చిట్టిబాబు తీరును నిరసిస్తూ గ్రామస్తుల ఆందోళన – ఉచ్చులవారిపేట నుంచి వెనుదిరిగిన ఎమ్మెల్యే చిట్టిబాబు pic.twitter.com/Zvn2lTgS1t
— anigalla???????? (@anigalla) March 6, 2022
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్తులు శ్మశానవాటికకు గ్రామస్థులు వెళ్లాంటూ పంట కాలువ దాటాల్సిందే. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారి.. అధికారంలోకి ఎవరొచ్చినా వారి సమస్య మాత్రం తీరటం లేదు. దీంతో.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు వచ్చినప్పుడు.. కాస్త గట్టిగానే నిలదీశారు.
మొదట్లో వారిని సుముదాయించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే.. గ్రామస్తుల గట్టిగా ప్రశ్నించటంతో ఆయనలోని అధికార పార్టీ ఎమ్మెల్యే నిద్ర లేచారు. త్వరలోనే పంటకాలువపై వంతెన నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పినా.. దాంతో సంబంధం లేకుండా మరో వంతెన ఎప్పుడు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. వంతెన రాదని తేల్చేశారు.
ఎమ్మెల్యే మాటలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. అయితే ఎమ్మెల్యే తమ గ్రామానికి రావాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో ఆ గ్రామం నుంచి ఎమ్మెల్యే వెనుదిరగక తప్పలేదు. ఇలాంటి సందర్భాల్లో కాస్తంత కూల్ గా ఉండకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి.
ఈయన ఇపుడే కాదు గతంలోను ఇలాగే ప్రవర్తించేవారు.
మొన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ సీఐను నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. నిన్న ఓ అధికారిని చెప్పు తెగేదాకా కొడతా… నీ ఇష్టమొచ్చినట్లు ఇసుక తరలిస్తే నీ అంతు చూస్తా అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఊగిపోయారు. నేడు వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఓ మహిళా వాలంటీర్‌పై.. pic.twitter.com/EvtPLVuE1w
— TDP Activist (@TdpActivist) November 9, 2020