రాధే శ్యామ్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్లను ప్రారంభించింది. ఇదొక రొమాంటిక్ డ్రామా అని ట్రైలర్ లో చాలా స్పస్టంగా అర్థమవుతోంది.
వచ్చే వారం విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్రముఖ పామ్ రీడర్గా కనిపిస్తున్నాడు. “ప్రేమ మరియు విధి మధ్య యుద్ధం” అని ట్రైలర్లో ఒక్కమాటలో ఈ సినిమా లైన్ ఏంటో చెప్పేశారు.
రాధే శ్యామ్ 1970ల యూరప్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. రాధా కృష్ణ కుమార్ రచన మరియు దర్శకత్వం వహించిన ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఇందులో సచిన్ ఖేడేకర్, సత్యరాజ్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ మరియు సత్యన్ కూడా ఉన్నారు.
సినిమాలో ప్రభాస్ పాత్ర నిజ జీవితంలోని వ్యక్తి నుండి ప్రేరణ పొందిందని దర్శకుడు వెల్లడించారు. “రాధే శ్యామ్లోని విక్రమాదిత్య పాత్ర యూరోపియన్ హస్తసాముద్రికవేత్త చెయిరోచే ప్రేరణ పొందింది. అలాగే రెండు మూడు నిజ జీవితంలో జరిగిన సంఘటనలను జోడించి కథను డెవలప్ చేశాం’ అని మీడియాకు తెలిపారు.
రాధే శ్యామ్ 2018 నుండి నిర్మాణంలో ఉంది. వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అయ్యింది. గతేడాది జూలైలోనే షూటింగ్ పూర్తయింది.
రాధే శ్యామ్ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయాలని భావించారు. అయితే, మూడవ వేవ్ ఇన్ఫెక్షన్లు రావడంతో చిత్రనిర్మాతలు విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది.
తాజా ప్రమోషన్లలో పూజ హెగ్డే శ్వేత వర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది. స్టేజి మీద ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.