ఏపీలో చీమ చిటుక్కుమన్నా సరే….టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కారణమని చెప్పడం…వైసీపీ నేతలకు…ఆ పార్టీ పెద్దతల జగన్ కు అలవాటైపోయింది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చిన్నాన్న వివేకా మర్డర్ జరిగితే…ముందు గుండెపోటని గంటలకొద్దీ సాక్షి మీడియాలో స్టోరీలు నడిపిన జగన్….చివరకు మర్డర్ అని తేలడంతో దానిని అవలీలగా చంద్రబాబు మీదకు నెట్టేసి చేతులు దులుపుకున్నారు.
కట్ చేస్తే, ప్రతిపక్షనేతగా వివేకా కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్…సీఎం అయిన తర్వాత మాత్రం వివేకా కూతురు సునీత అడిగినా సరే సీబీఐ ఊసెత్తలేదు. పైగా, వివేకా కేసులో తాజాగా సీబీఐ అసలు దోషులను పట్టుకునే సమయానికి వారిపైనే సజ్జల వంటి నేతలు అభాండాలు వేస్తున్నారు. సీబీఐ అధికారులు సరిగా విచారణ చేయలేదని, అనుమానితులను బెదిరిస్తున్నారని వారిపైన కేసులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు జగన్ ను ఇరుకునపడేశాయి. దీంతో, మళ్లీ పాత ఫార్ములాకు వెళ్లిన జగన్ అండ్ కో….మరోసారి చంద్రబాబుపై ఆరోపణలు మొదలెట్టింది. చంద్రబాబు చేతిలో సునీత పావుగా మారారని సజ్జల చేసిన కామెంట్లపై టీడీపీ నేతలు మండిపడుతున్నానరు. ఈ నేపథ్యంలోనే జగన్ పై, సజ్జలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు.
ఇవాళ చంద్రబాబు చేతిలో సునీత పావు అన్నాడని, రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జలపై అయ్యన్న సెటైర్లు వేశారు. సజ్జల వంటి నీచుడి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్న షాకింగ్ కామెంట్లు చేశారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను షేర్ చేస్తూ అయ్యన్న చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు, సజ్జలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఫైర్ అయ్యారు. గతంలో నారాసుర చరిత్ర అని సిగ్గులేకుండా బురదజల్లారని, సాక్షి పత్రికకు ఉన్న సిగ్గు గురించి మాట్లాడడం మర్చిపోయావేం సజ్జలా అని వెంకన్న ప్రశ్నించారు. ఆ రోజు చంద్రబాబు చేయించారని చెప్పడానికి లేని సిగ్గు, ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డ సునీత జగనాసుర రక్తచరిత్ర బయటపెడితే వచ్చిందా అని ఫైర్ అయ్యారు.