వెండితెర మీదనే కాదు.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్లలో సురేఖ వాణి ఒకరు. ఆమె వయసుకు సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లకు సైతం షాకిచ్చే గ్లామర్ ఆమె సొంతం. తల్లీ కూతుళ్లు ఇద్దరి వైరల్ వీడియోలు అప్పడప్పుడు ట్రోల్ కావటం తెలిసిందే. టాలీవుడ్ విషయానికి వస్తే.. సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ ఇద్దరు కలిసి చేసిన వీడియోలు సందడి సందగిగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. పేరుకు తల్లీ కూతుళ్లే అయినా.. చూసేందుకు మాత్రం అక్కాచెల్లెళ్ల మాదిరి కనిపిస్తుంటారు.
ఆ మధ్యన సురేఖ వాణి భర్త మరణించటం.. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె పెద్దగా రాకపోవటం తెలిసిందే. అనుకోనిరీతిలో వచ్చి పడిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే ఆమె కుటుంబం బయటకు వస్తోంది. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది సురేఖ వాణి కుమార్తె సుప్రిత. అడిగిన ప్రశ్నకు అడిగినట్లుగా సమాధానం చెప్పటమే కాదు.. నిజాన్ని షేర్ చేసుకునేందుకు ఏ మాత్రం జంకని ఆమె తీరు.. ఆకర్షించేలా ఉంది.
ఇటీవల కాలంలో సురేఖ వాణి రెండో పెళ్లిపై వస్తున్న వార్తల మీద అడిగిన ప్రశ్నకు ఓపెన్ అయ్యారు సుప్రిత. రెండో పెళ్లి అన్నది పూర్తిగా తన తల్లి తీసుకునే నిర్ణయమని.. తన వరకైతే కచ్ఛితంగా అమ్మకి రెండో పెళ్లి చేయాలనే ఉందన్నారు. అయితే.. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందన్న ఆమె.. ఇప్పడిప్పుడే సెటిల్ అవుతున్నామన్నారు. తన తండ్రి మరణం గురించి చెబుతూ తీవ్రభావోద్వేగానికి గురయ్యారు.