ఉక్రెయిన్ విషయంలో ప్రపంచదేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పెద్ద షాకే ఇచ్చారు. తూర్పు ఉక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాలైన దొనెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా రష్యా గుర్తిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. తమ ప్రాంతాలను స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తించాలని వేర్పాటువాదులు చాలాకాలంగా సాయుధ పోరాటాలు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వీళ్ళని ఉక్రెయిన్ అణిచివేస్తోంది.
ఇపుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేరుగా ఉక్రెయిన్ మీదకు యుద్ధానికి పోకుండా లేకపోతే ఉక్రెయిన్ను ఆక్రమించకుండానే పరోక్షంగా తాను అనుకున్నది చేస్తున్నారు.
ఎలాగంటే ఉక్రెయిన్ లో కీలకమైన పై రెండు భూభాగాలను స్వతంత్ర ప్రతిపత్తి గత ప్రాంతాలుగా గుర్తించామని చెప్పిన వెంటనే ఆ ప్రాంతాల్లో రష్యా ప్రవేశిస్తుంది. పై రెండు ప్రాంతాలకు రష్యా ప్రకారం ఎలాగూ సంబంధాలు లేవు కాబట్టి ఉక్రెయిన్ను ఆక్రమించినట్లు కూడా కాదు.
పుతిన్ తాజా ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే దాగుంది. ఎలాగంటే ఇతర దేశాలనుండి ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఆహారం, మందులు లాంటి వాటిని నాటో దేశాలు అందిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజదాని కీవ్ తో పాటు ఇతర కీలకమైన ప్రాంతాలకు చేరుకోవాలంటే దొనెట్క్స్, లుహాన్క్స్ చాలా కీలకం. ఇపుడీ రెండు ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతాలను చెప్పుకోవటంతో ఆయుధాలు, మందులు, ఆహారం తదితరాలను తమ భూభాగం నుండి సరఫరాకు అంగీకరించవు.
దాంతో ఉక్రెయిన్ తిప్పలు తప్పవు. దీన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం అంగీకరించటం లేదు. సరే ఉక్రెయిన్ అంగీకారంతో సంబంధంలేకుండానే పుతిన్ తనపని తాను చేసుకుపోతున్నారు. దీంతో ఇపుడు ఉక్రెయిన్ తో పాటు ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైపోయాయి. పై ప్రాంతాల మీదనుండి ఉక్రెయిన్ కు చేరుకోవాల్సిన మార్గాలన్నింటినీ రష్యా సైన్యమే అదుపులోకి తీసేసుకుంది. పనిలోపనిగా పై రెండు ప్రాంతాల్లోకి రష్యా సైన్యాలు దిగేస్తున్నాయి. పుతిన్ తాజా చర్యలతో ప్రపంచదేశాలకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.