టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్, మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా ఇప్పటిదాకా చేసిన నాలుగు సినిమాలతోనూ అతను బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. ఆ తర్వాత అతడికి మెగా ఛాన్స్ వచ్చింది.
టాలీవుడ్లో ప్రతి దర్శకుడు తప్పక సినిమా చేయాలని కోరుకునే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు కొరటాల. ఈ సినిమా ఓకే అయినపుడు కొరటాల ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. కానీ ఈ సినిమా చేయడం ఆయనకు శాపంగా మారింది.
ఇప్పుడు ఎందుకీ సినిమా చేశానా అని చింతించే స్థితిలో ఉన్నాడాయన. కొరటాల చివరి సినిమా ‘భరత్ అనే నేను’ రిలీజైంది 2018లో. ఇప్పుడు 2022లోకి వచ్చేశాం. నాలుగేళ్ల తర్వాత కూడా కొరటాల కొత్త సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. ఇప్పటికే చాలాసార్లు సినిమాను వాయిదా వేశారు. చివరగా ఏప్రిల్ 1కి రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ అప్పుడు కూడా సినిమా రిలీజవుతుందన్న గ్యారెంటీ లేదు.
కరోనా అడ్డం పడితే ఏం చేస్తారు అన్న డౌట్ రావచ్చు. కానీ కరోనా అడ్డంకుల్ని దాటి కూడా అఖండ, పుష్ప సహా చాలా సినిమాలు రిలీజయ్యాయి. ఇదేమైనా ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి భారీ చిత్రమా అంటే అదీ కాదు. ‘ఆచార్య’ ఓకే అయినపుడే ‘ఆర్ఆర్ఆర్’కు కూడా శ్రీకారం చుట్టారు. ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేసి ఫస్ట్ కాపీతో రెడీగా పెట్టుకున్నారు.
పరిస్థితులు అనుకూలించక విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ‘ఆచార్య’ మాత్రం విడుదలకు ఇప్పటికీ సిద్ధంగా లేదు. షూటింగ్లో ఆలస్యం.. పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం.. ఇలా విపరీతంగా లేటే అవుతోంది. మామూలుగా వేగంగా సినిమాలు తీసేసే కొరటాల.. ఈ సినిమాకు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు.
ఇలా లేటవడం వల్ల సినిమా మీద ఆసక్తి పోతోంది. చిరంజీవితో సినిమా సంబరం ఏమో కానీ.. ఈ సినిమా చేయడం వల్ల కొరటాల కెరీర్లో విలువైన సమయం వేస్ట్ అయిందన్నది వాస్తవం. కనీసం ‘ఆచార్య’ బ్లాక్‌బస్టర్ అయినా అయితే కొంత నష్టం పూడ్చుకున్నట్లవుతుంది. అలా కాక సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే మాత్రం కొరటాల కెరీర్‌కు ఇది బ్రేక్‌గా మారొచ్చు.