ప్రతిపక్షాలపైన, మీడియాపైన కులముద్రలు పార్టీ ముద్రలు వేసి… తమ అసమర్థతను, అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు చేయని ప్రయత్నం ఉండదా?
చిన్న పాజిటివ్ జరిగినా తమ ఖాతాలో వేసుకోవడం, ఏదైనా నెగెటివ్ కనిపిస్తే అది ప్రతిపక్షాల ఖాతాలో వేయడం ఇదీ వైసీపీ తంతు.
చివరకు మీడియాలో రాసే నిజాలు ప్రజలు ఎక్కడ నమ్ముతారో అని ప్రజాస్వామ్యపు నాలుగో స్థంభం అయిన మీడియాను భ్రష్టుపట్టించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు వైసీపీ నేతలు.
ప్రకృతికి గొప్ప శక్తి ఉంటుంది. ఒక అవకాశం పోతే ఇంకో అవకాశాన్ని సృష్టిస్తుంటుంది. అలా పుట్టుకొచ్చి మర్రి చెట్టులా వ్యాపించిన శక్తే సోషల్ మీడియా.
మీడియాను ఏదో విధంగా బ్లేమ్ చేయగలరు గాని సోషల్ మీడియా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ప్రతిపక్షంలో ఉన్నపుడు అబద్ధాలతో అధికార పక్షాన్ని సోషల్ మీడియా వాడుకుని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు… ఇపుడు వారు మాట్లాడిన వీడియోలు పెట్టినా కూడా ఉడికిపోతున్నారు.
సోషల్ మీడియాను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నేరుగా వ్యక్తిగత వేధింపులకు తెగబడ్డారు. చివరకు ఒకపుడు వైసీపీకి పనిచేసి వారి నిజస్వరూపం తెలుసుకుని పార్టీల గోల అంటకుండా దళిత జనోద్దరణ అంటూ తన పోరాటం ఏందో చేసుకుంటున్న మహాసేన రాజేష్ ను వైసీపీ కెలికింది. ఎవరో వైసీపీ నాయకుడు అంట ఫోన్ చేసి జగన్ కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తే చంపేస్తాను అంటూ బెదిరించాడు.
నీ చేతనైంది చేసుకో వీడియోలు చేయడం ఆపను అంటూ మహాసేన రాజేష్ బెదిరించాడు. దీంతో ఆ వైసీపీ నేతకు ఏం చేయాలో తెలియని అయోమయం. తాజాగా రాజేష్ విడుదల చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
బీజేపీ వాళ్లు వైసీపీతో ఎలా ఆడుకుంటున్నారు, వైసీపీ నేతలను ఎలా బఫూన్లను చేస్తున్నారు అనే విషయాన్ని వీడియో సాక్ష్యాలతో సహా నిరూపించారు … ఆ వీడియో ఇదే. చూడండి.