- యథేచ్ఛగా సాగు.. సరఫరా
- గతంలో ఎన్నడేలేనంతగా బరితెగింపు
- పోలీసులపైనే దాడులు చేయిస్తున్న స్మగ్లర్లు
ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగుకు, స్మగ్లింగ్‌కు మూలకేంద్రంగా మారింది. ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావు. గంజాయి పట్టుబడిన రాష్ట్రాలు, చివరకు కేంద్ర ఏజెన్సీలు సైతం ఇదే మాట చెబుతుండడంతో మన పరువుపోతోందని రిటైర్డ్ పోలీసు అధికారులు వాపోతున్నారు. గంజాయి కట్టడికి ఎన్నో చర్యలు తీసుకున్నామని… పంటను ధ్వంసం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ ఆనవాళ్లే కనిపించడం లేదు.
ఖమ్మం, హైదరాబాద్ మీదుగా నిర్భయంగా రూ.వందల కోట్ల విలువ చేసే గంజాయు అక్రమ రవాణా అవుతోంది. విశాఖ మన్యంలో వైసీపీ నేతలు గంజాయి సాగు, స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసినా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వారి వద్ద పనిచేసే ఒకరిద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వద్ద దొరికే కొద్దోగొప్పో గంజాయిని వేరే చోట ధ్వంసం చేసి.. పంట సాగును నాశనం చేశామని కలరింగ్ ఇస్తున్నారు.
తెలంగాణ పోలీసులు మన్యంలో స్మగ్లర్లను అరెస్టు చేయడానికి వస్తే.. స్థానిక గిరిజనులను వారిపైకి ఉసిగొల్పిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా స్థానిక పోలీసులు కలిసిరాకపోవడంతో తెలంగాణ పోలీసులే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటన వెనుక వాస్తవాలను ఆంధ్ర పోలీసులు ఇప్పటివరకు వెల్లడించకపోవడమే వైసీపీ నేతలే స్మగ్లర్లు అన్న విషయాన్ని చాటుతోందని అంటున్నారు.
ఇటీవల సూర్యాపేట వద్ద వందల కిలోల గంజాయిని లారీల్లో తరలిస్తుండగా టీ-పోలీసులు పట్టుకున్నారు. విశాఖ మన్యం నుంచే ఈ లారీలు వస్తున్నాయని.. అక్కడి స్మగ్లర్లపై విచారణ జరుపుతున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనపై మండిపడ్డారు. టీడీపీ నేతలతో ఎస్పీకి సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. దీనికి రంగనాథ్ దీటుగానే జవాబిచ్చారు.
లారీల్లో ఉన్నవారిని, డ్రైవర్లను విచారించినప్పుడు వాస్తవాలు బయటపడ్డాయని.. తనపై అనవసర, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దాంతో విజయసాయిరెడ్డి కిక్కురుమనలేదు. గంజాయి స్మగ్లింగ్‌లో నిజంగా తమ నేతలకు ప్రమేయం లేకపోతే విజయసాయి ఎందుకు జోక్యం చేసుకున్నారని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సిన ఐడియాను గంజాయి స్మగ్లర్లు ఫాలో అయ్యారు. #Pushpa #AndhraPradesh #Pressreview https://t.co/KKLdNDRVG6
— BBC News Telugu (@bbcnewstelugu) February 7, 2022
రెండు వైపులా తెలంగాణ తనిఖీలు..
పండుగల సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేసే వారు కాదు. అయితే దీపావళి నుంచి సోదాలు పెరిగాయి. కార్లు, బైకులు, బస్సులు.. ఏవీ వదలకుండా చెక్ చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారని అడుగుతుంటే.. గంజాయి అక్రమ రవాణా మీ రాష్ట్రం నుంచే జరుగుతోందని పోలీసులు బదులిస్తున్నారు. ఇదెంత పరువు తక్కువని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఎప్పుడూ పట్టుబడనంత హెరాయిన్ ఇటీవల గుజరాతలోని ముంద్రా పోర్టులో పట్టుబడినప్పుడు విజయవాడ అడ్రస్ వెలుగులోకి రావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు ఏపీ గురించే మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వస్తోందంటూ అక్కడి ఐపీఎస్ అధికారులు వెల్లడించిన వీడియోలు సైతం గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కార్లు, లారీలు, గూడ్స్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సైతం వదలడం లేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి.
హెరాయిన్, ఇతర డ్రగ్స్‌తో రెండేళ్లుగా హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతోపాటు ఇతర ప్రముఖుల పేర్లు బయటికి రావడంతో విచారణ జరగడం దేశవ్యాప్తంగా బాగా ప్రచారమైంది. బెంగళూరులో ఇద్దరు సినీ హీరోయిన్లు ఏకంగా కొన్ని నెలల పాటు జైల్లో గడిపారు. ఇటీవల షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడంతో.. ఆయా రాష్ట్రాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
మరిన్ని రాష్ట్రాల్లోనూ..
దేశంలో మరిన్ని రాష్ట్రాల్లోని పోలీసులు సైతం ఏపీ నుంచే తమ ప్రాంతానికి గంజాయి వస్తోందంటూ మీడియాలో మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. ప్రతిపక్షం చేసిన ఆరోపణలు, పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎదురు దాడి చేసిన జగన్ ప్రభుత్వ పెద్దలు ఏడెనిమిది రాష్ట్రల పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డారు.
ఇదే సమయంలో గంజాయి సమస్యపై కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభావిత ప్రాంతాల పోలీసులతో కలిసి ఉమ్మడిగా చర్యలు తీసుకుని కట్టడి చేయాలని ఏపీ సర్కారుకు సూచించాయి. దీంతో కొన్నాళ్ల కింద విశాఖపట్నంలో 8 పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమై గంజాయి ధ్వంసానికి ప్రణాళిక రూపొందించారు.
’ఇక్కడ సాగు మేం ధ్వంసం చేస్తాం.. రవాణా కూడా కట్టడి చేస్తాం.. మీరు కూడా సమాచారం ఇస్తే ఉమ్మడిగా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుదాం’ అని వారితో చెప్పారు. అందుకు ఇతర ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులు సమ్మతించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మన్యంలో రాష్ట్ర పోలీసులపై గంజాయి స్మగ్లర్లు దాడులు చేయించడం సంచలనం సృష్టించింది.
బడా స్మగ్లర్ల తరఫున దరిదాపుగా 90 మంది ప్రస్తుతం అక్కడడ మకాం వేసినట్లు తెలిసింది. గంజాయి సాగుకు జూన్‌లోనే విత్తనాల సరఫరా నుంచి నవంబరు-డిసెంబరులో కొనుగోలు వరకూ అన్నీ వీరే చూసుకుంటుంటారు. స్మగ్లింగ్ ఈ స్థాయిలో వ్యవస్థీకృతమవుతుంటే.. ఏమీ లేకున్నా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సీఎం జగన్ చెప్పడం విశేషం.
@Chirufan4ever @chirusainikudu @Chiru2020_ @ysjagan
గంజాయి అమ్మే సన్నాసివి
పేదల బ్రతుకులతో పేకాట ఆడే జూదగాడివి
అమాయకుల మాంసంతో వ్యాపారం చేసే కసాయివాడివిదొంగల నాయకుడివి .. దోపిడీకి వారసుడివి pic.twitter.com/NnyFUzeeHT
— Srini (@SrinuThePrince) February 7, 2022
excellent put up, very informative. I ponder why the opposite specialists of this sector don’t notice this.
You must proceed your writing. I’m sure, you’ve a huge
readers’ base already!