యూట్యూబర్ సరయు గురించి సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర లేదు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్ లో తన మార్క్ బోల్డ్ వీడియోలు, డైలాగులతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది సరయు. ఆ పాపులారిటీతోనే తెలుగు బిగ్ బాస్ లో కూడా హల్ చల్ చేసింది. అయితే, వారంలోపే సరయు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు సరయు మార్క్ ఎంటర్టైన్ మెంట్ మిస్సయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా సరయు ఓ వివాదంలో చిక్కుకుంది. 7 ఆర్ట్స్ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో విజువల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ పాటలో సరయు అండ్ టీం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందంటూ కేసు నమోదైంది. ఆ పాటలో సరయుతో పాటు ఆమె టీం మెంబర్స్…తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లను కట్టుకున్నారు.
అయితే, దేవుడి రిబ్బన్లను ధరించిన వారంతా మద్యం సేవించినట్లుగా ఆ పాటలో చూపించడంపై కొందరు హిందుత్వ సంఘాల నేతలు మండిపడుతున్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా ఆ వీడియోలోని సన్నివేశాలున్నాయంటూ సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసు వ్యవహారంపై సరయు ఇప్పటిదాకా స్పందించలేదు.