ఏపీలో కొద్ది రోజులుగా అనధికార విద్యుత్ కోతలు మొదలైన సంగతి తెలిసిందే. వేసవికాలం రాకముందే చెప్పా పెట్టకుండా గంటల కొద్దీ కరెంటు కోతు విధిస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతోనే ఎన్టీపీసీ సంస్థ ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేసిందని, అందుకే డిమాండ్ కు తగ్గ సప్లై లేక లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలతో జనానికి జగన్ వాతుల పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ‘సెటైర్ నెక్ట్స్ లెవెల్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ జగన్ పై గోరంట్ల ఓ రేంజ్ లో చురకలంటించారు. కోతలు..మాటలు తాడేపల్లి కోట దాటే లోపు ఏపీలో కరెంటు కోతలు మొదలయ్యాయని గోరంట్ల సెటైర్లు వేశారు. ప్రియమైన ముఖ్యమంత్రి గారి ఆయన పేటీఎం కార్మికులు పవర్ఫుల్ అంటారని, కానీ,ఆయన హయాంలో ఏపీలో పవర్ ఉండడం లేదని చురకలంటించారు.
ఈ కోతల వెనుక కథ ఏంటో చెప్పాలని సెటైర్ వేశారు. రాబోయే వేసవి కాలంలో కోతలకు రిహార్సల్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారా ప్రియమైన ముఖ్యమంత్రి గారు అంటూ పంచ్ లు వేశారు. ఇంతకీ కరెంటు లోటు ఏర్పడిందా లేక ఏర్పడేలా చేశారా? అంటూ గోరంట్ల వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ట్విటర్ వేదికగా జగన్ పై గోరంట్ల విమర్శనాస్త్రాలు సంధించిన సంధించిన సంగతి తెలిసిందే.