ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ..ఆల్రెడీ ఒక చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు నిందితులను వదిలేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డిలు నార్కో అనాలసిస్ టెస్ట్‌కు అంగీకరించాలని గతంలో టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఒకవేళ, నార్కో అనాలసిస్‌కు వారు అంగీకరించకుంటే..హత్యతో సంబంధం ఉందని అనుమానించక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు టీడీపీ నేతల ఒత్తిడితో ఈ కేసులో అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శివ శంకర్ రెడ్డి పేరు చార్జిషీట్ లో చేరింది.
పులివెందుల కోర్టులో సీబీఐ రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఆ చార్జిషీటులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా చేర్చింది. గత ఏడాది నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైల్లో ఉంటున్న శివశంకర్ రెడ్డిపై తాజాగా చార్జి షీట్ దాఖలైంది. ఈ కేసులో సీబీఐ తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో వివేకా డ్రైవర్ షేక్ దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారి ఇచ్చిన సమాచారంతోనే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వివేకా కేసులో శంకర్ రెడ్డి పేరు చార్జిషీట్లో చేరడంతో అవినాశ్ రెడ్డికి షాక్ తగిలినట్లయింది.