శ్రీకాకుళం ఎంపీ రామ్ మోహన్ నాయుడు తన కుమార్తె మిహిరా అన్వీ శివాంకృతి మొదటి పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అతను తన ట్విటర్ ద్వారా తన కుమార్తెకు సమృద్ధిగా ఆనందం మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు.
ఇందులో షేర్ చేసిన ఫొటోలో రామ్ మోహన్ తన భార్య శ్రావ్య మరియు అతని తల్లి విజయకుమారితో కూతురి చూడచక్కగా ఉన్నారు. పుట్టినరోజున చిన్నారి మిహిరా కూడా బోసినవ్వులు కురిపిస్తూ క్యూట్ గా ఉంది. రామ్మోహన్ తండ్రి దివంగత మాజీ మంత్రి ఎర్ర న్నాయుడు నవ్వుతున్న ఫొటో గోడపై ఉండగా… అక్కడ వీరు దిగిన ఈ ఫొటో అందరిలో చిరు నవ్వును నింపుతోంది.
కింజరపు కుటుంబం అభిమానులు చిన్నారిపై శుభాకాంక్షల వర్షం కురిపించారు.
2017లో రామ్మోహన్ నాయుడుకి శ్రావ్యతో వివాహమైంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు శ్రావ్య.
— Gnana sai (@saibaba_penta) January 30, 2022