కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్ప మనవరాలు ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్యకు పాల్పడిన ఆమె పేరు సౌందర్య, వయసు 30 ఏళ్లు. బెంగళూరులోని MS రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌంట్ కార్మెల్ కాలేజీ సమీపంలోని ఓ భారీ అపార్ట్మెంట్లో ఆమె తన భర్త, తోటి వైద్యుడు, ఆరు నెలల చిన్నారితో కలిసి నివసిస్తోంది.
రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది. శుక్రవారం ఉదయం సౌందర్య మృతి చెందినట్లు బయట ప్రపంచానికి తెలిసింది.
మరణానికి కారణాలను నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.
సౌందర్య యడియూరప్ప మొదటి కుమార్తె పద్మ కూతురు. కుటుంబంలో పెద్ద అమ్మాయి సౌందర్యే.
సౌందర్య మృతితో యడ్యూరప్ప కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకుని బిజెపి అగ్రనేత యడ్యూరప్పను ఓదార్చారు.