గుడివాడలో క్యాసినో వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినో, పోకర్, పేకాట, గోవా నుంచి వచ్చిన చీర్ గాళ్స్ తో అసభ్యకర డ్యాన్స్ లు నిర్వహించారని టీడీపీ నేతలు వీడియోలు, ఫ్లైట్ వివరాలతో సహా ప్రూవ్ చేసి నానిని కార్నర్ చేస్తున్నారు. అయితే, తన ఫంక్షన్ హాల్ లో ఏమీ జరగలేదని నాని బుకాయిస్తున్నారు. ఇలా, టీడీపీ నేతలకు నానికి మధ్య జరుగుతున్న వార్ లో నాని చిరకాల మిత్రుడు ఎంటర్ కావడంతో నాని అడ్డంగా బుక్కయ్యారు.
కొడాలి నానిని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ చేశారు. నాని ఫంక్షన్ హాల్లో కేసినో నిర్వహించలేదని చెప్పారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా కోడి పందాలు, పేకాట శిబిరాలు కొనసాగాయని చెప్పారు. తన మ్యూచువల్ ఫ్రెండ్స్ కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో ప్రతి ఏటా మాదిరిగానే సంబరాల శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఈ విషయం గురించి కొడాలి నానికి తెలియదని, ఆయన కోవిడ్ బారిన పడి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా అక్కడ క్యాసినో, పోకర్ జరగలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు కూడా జరిగాయని నానిని వెనకేసుకు వచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని, నిజ నిర్ధారణ కమిటీ పేరుతో అలజడి రేపుతోందని ఆరోపించారు. అమ్మాయిలు చేసిన డ్యాన్సుల్లో అర్ధ నగ్న నృత్యాలు లేవని అన్నారు. అయితే, ఇప్పటిదాకా అసలేం జరగలేదని చెప్పిన నాని…తాజాగా వంశీ చేసిన కామెంట్లతో దొరికిపోయినట్లయిందన్న విమర్శలు వస్తున్నాయి. నానిని కాపాడబోయిన వంశీ…ఆయనను అడ్డంగా బుక్ చేశారని కామెంట్లు వస్తున్నాయి.